Bhairava Dweepam re-release: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భైరవ ద్వీపం రీరిలీజ్ వాయిదా-bhairava dweepam re release post poned ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhairava Dweepam Re-release: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భైరవ ద్వీపం రీరిలీజ్ వాయిదా

Bhairava Dweepam re-release: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భైరవ ద్వీపం రీరిలీజ్ వాయిదా

Hari Prasad S HT Telugu
Aug 30, 2023 09:18 AM IST

Bhairava Dweepam re-release: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. భైరవ ద్వీపం రీరిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా బుధవారమే (ఆగస్ట్ 30) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. నవంబర్ కు వాయిదా వేశారు.

బాల‌కృష్ణ  భైర‌వ ద్వీపం
బాల‌కృష్ణ భైర‌వ ద్వీపం

Bhairava Dweepam re-release: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. ఈ సినిమా బుధవారమే (ఆగస్ట్ 30) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పుడో 29 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమాను మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఎంతో ముందుగానే ఆగస్ట్ 30న రీ రిలీజ్ అని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాకపోవడంతో ఈ రీరిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రోజా ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ భైరవ ద్వీపం మూవీని రీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ మూవీని నవంబర్ లో రీ రిలీజ్ చేస్తామని చెప్పినా.. తేదీ మాత్రం వెల్లడించలేదు. నిజానికి ఆగస్ట్ 5వ తేదీనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించినా.. అప్పుడూ బుకింగ్స్ లేకపోవడంతో ఆగస్ట్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.

మరోవైపు బాలయ్య బాబు నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024