తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo X80 Lite 5g । వివో నుంచి కొత్త ఫోన్‌.. ఇది మరొక మోడల్‌కు రీబ్రాండ్ వెర్షన్‌

Vivo X80 Lite 5G । వివో నుంచి కొత్త ఫోన్‌.. ఇది మరొక మోడల్‌కు రీబ్రాండ్ వెర్షన్‌

HT Telugu Desk HT Telugu

22 September 2022, 16:01 IST

    • వివో నుంచి Vivo X80 Lite 5G అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని ప్రధాన ఫీచర్లు మరొక మోడల్ ను పోలి ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Vivo X80 Lite 5G
Vivo X80 Lite 5G

Vivo X80 Lite 5G

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ వివో తాజాగా Vivo X80 Lite 5G అనే మరొక స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే వివో కొన్ని నెలల క్రితం Vivo X80 పేరుతో ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన మోడల్ దానికి పూర్తిగా విభిన్నం. ఈ Vivo X80 Lite 5G అనేది కొన్ని మిడ్-రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఎంట్రీలెవెల్ మొబైల్.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

Vivo X80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన అంశాలను పరిశీలిస్తే, ఇది 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 9-సిరీస్ చిప్‌సెట్ వంటి కొన్ని మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ సన్‌రైజ్ గోల్డ్, డైమండ్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ వెనక భాగం యాంటీ రిఫ్లెక్టివ్ ఫ్లోరైట్ గ్లాస్‌తో తయారు చేసినది. సన్‌రైజ్ గోల్డ్ వేరియంట్ బ్యాక్ ప్యానెల మీద కాంతిపడినపుడు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో విభిన్న రంగులను చూపుతుంది, ఇక డైమండ్ బ్లాక్ కలర్ మోడల్ సూర్య కాంతి పడినపుడు సొగసైన డైమండ్ నమూనాను చూపుతుంది.

ర్యామ్, స్టోరేజ్ పరంగా Vivo X80 Lite 5G ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

Vivo X80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44-అంగుళాల FHD+AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+8MP+2MP కెమెరా, ముందు భాగంలో 50 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4400 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఛార్జర్

ఇంకా గేమింగ్ కోసం Vivo X80 Liteలో లిక్విడ్-కూలింగ్ సిస్టమ్, స్టీరియో స్పీకర్లు, గేమ్‌లలో 4D వైబ్రేషన్, గేమింగ్-ఫ్రెండ్లీ యాంటెన్నా డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీపరంగా.. డ్యూయల్ సిమ్, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C పోర్ట్ వంటివి ఉన్నాయి.

ఇది ప్రస్తుతం Czechia అనే యూరోప్ దేశంలో CZK 10,999 (సుమారు రూ. 35 వేల) ధరకు విడుదలైంది. ఈ ఫోన్ Vivo V25 రీబ్రాండెడ్ వెర్షన్‌లా ఉంది కాబట్టి ఆసియా దేశాలలో ఇప్పుడే విడుదల చేయకపోవచ్చు.

తదుపరి వ్యాసం