తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : ఎవరివల్లనైనా తరచూ హర్ట్ అవుతున్నారా? అయితే తప్పు మీదే

Tuesday Motivation : ఎవరివల్లనైనా తరచూ హర్ట్ అవుతున్నారా? అయితే తప్పు మీదే

01 November 2022, 6:15 IST

    • Tuesday Motivation : ప్రపంచంలో ఎవరూ ఎవరిని కంటిన్యూగా హర్ట్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఎల్లప్పుడూ హర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం మీరు వారికి ఇచ్చిన పర్మిషనే. ఏ వ్యక్తి అయినా.. మరొక వ్యక్తికి ఇచ్చే చనువు బట్టే.. వాళ్లు మనల్ని మళ్లీ మళ్లీ హర్ట్ చేస్తారు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ఎవరూ ఎవరిని ఊరికే హర్ట్ చేయరు. చేయలేరు. మనం ఎవరి వల్లనైనా హర్ట్ కావొచ్చు. కానీ ఆ వ్యక్తి పదే పదే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారంటే.. అది మీ అవసరమైనా అయి ఉండాలి. లేదా వాళ్లు మిమ్మల్ని హర్ట్ చేయడానికి మీరే పర్మిషన్ ఇచ్చి ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బాధపెడుతుంటే.. అది వారు ఇచ్చేది కాదు. మీరే వాళ్లకి ఇచ్చిన చనువు. తప్పు కచ్చితంగా మీదే అవుతుంది. మీ తప్పులేకుండా ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే.. మీరు వారికిచ్చే సమాధానంపైనే ప్రతీది ఆధారపడి ఉంటుంది.

ఒకరు మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు.. వారి నుంచి దూరంగా వెళ్లడమో.. వాళ్లు మిమ్మల్ని మరోసారి హర్ట్ చేయకుండా గట్టి జవాబు ఇవ్వడమో చేయాలి. మీరు ఈ రెండు చేయట్లేదు అంటే.. వాళ్లు మరోసారి హర్ట్ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చినట్లే. మీ తప్పు ఉన్నప్పుడు మీరు హర్ట్ అవ్వడంలో ఓ అర్థముంది. కానీ మీ తప్పే లేనప్పుడు మీరు హర్ట్ అవుతూ ఉంటే కచ్చితంగా దానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మీపై ఉందని అర్థం.

ఎవరైనా మిమ్మల్ని పదే పదే హర్ట్ చేస్తున్నా మీరు వారితోనే.. లేదా వారికి దగ్గరగా ఉంటున్నారంటే దాని అర్థం వారిని మీరు ప్రేమిస్తూ అయినా ఉండాలి. లేదా వారితో మీకు ఏదైనా అవసరం ఉండి ఉండాలి. ఈ రెండే మీ కారణాలు అయితే.. ఎదుటివాళ్లు హర్ట్ చేస్తున్నా.. మీరు మౌనంగా భరిస్తూ ఉంటారు. ప్రేమిస్తూ ఉంటే.. మీరు వారి ప్రేమను పొందేందుకు తిరిగి వారిని ఏమనరు. పైగా మీరు హర్ట్ అయినా సరే.. మన వాళ్లే కదా అనుకుంటూ ఉంటారు. అదే అవసరం అనుకోండి.. వాళ్లని హర్ట్ చేయడానికి మీకు ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూస్తారు.

ప్రేమ కాదు.. అవసరం కాదు అనుకుంటే.. మిమ్మల్ని హర్ట్ చేస్తున్నవారికి వెంటనే గట్టిగా సమాధానం ఇవ్వండి. మరోసారి వాళ్లు మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్స్ ఇవ్వకండి. దేని వల్లనైనా.. ఎవరి వల్లనైనా హర్ట్ అవ్వడం జరగదు. మీరు తీసుకునే దానిని బట్టే అది ఆధారపడి ఉంటుంది. మీరు హర్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రమే మీరు హర్ట్ అవుతారు. హే ఛల్.. దీనికి నేను హర్ట్ అవ్వడం ఏమిటి అనుకుంటే.. మీరు దేని గురించి హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండాలో.. బాధతో ఉండాలో మీరు మాత్రమే డిసైడ్ చేసుకోగలరు. ఒకవేళ ఎవరి వల్ల హర్ట్ అయినా.. తిరిగి కోలుకోగలిగే స్టామినా మీకు ఉందని మరచిపోకండి. పడినా లేవండి. హర్ట్ అయినా తిరిగి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీకు మీరుంటే చాలు. అదే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

తదుపరి వ్యాసం