తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuberculosis Causes : సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణానికే ముప్పు..

Tuberculosis Causes : సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణానికే ముప్పు..

28 January 2023, 11:27 IST

    • All about Tuberculosis : క్షయ వ్యాధిని తేలికగా చూడకూడదని.. సరైన సమయంలో చికిత్స తీసుకుని.. మందులు వాడాలని అంటున్నారు. లేకుంటే అది ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి దీనిని ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏమిటి? చికిత్స ఎంతకాలం తీసుకోవాలి? నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్షయ వ్యాధి
క్షయ వ్యాధి

క్షయ వ్యాధి

Tuberculosis Causes : క్షయ అనేది ఊపిరితిత్తులపై దాడి చేసే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా COVID-19 తర్వాత రెండవ ప్రధాన అంటువ్యాధి కిల్లర్ క్షయనే. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా గాలిలో విడుదలయ్యే తుంపర్ల ద్వారా ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. మరి ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్సను ఎంతకాలం కొనసాగించాలి వంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఊపిరితిత్తులతో పాటు.. మెదడు, వెన్నెముకపై ప్రభావం

క్షయవ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా.. మెదడు, వెన్నెముక వంటి మీ శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. ఇది సాధారణంగా రెండు రూపాలను కలిగి ఉంటుంది. గుప్త, క్రియాశీల.

మొదటిది క్షయవ్యాధి సూక్ష్మక్రిములు మీ శరీరంలో ఉన్నాయని అర్థం అయితే మీ రోగనిరోధక వ్యవస్థ దానిని వ్యాప్తి చేయనివ్వదు. క్రిములు గుణించి.. తరువాతి కాలంలో మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.

మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ వల్లనే..

క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్లనే వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా నవ్వినప్పుడు విడుదల చేసే తుంపర్ల ద్వారా ఇది వస్తుంది. మీరు వారితో ఎక్కువసేపు ఉన్నట్లయితే మీరు దాని బారినపడే అవకాశముంది. మీరు పొగ తాగుతూ ఉంటే.. ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.

లక్షణాలు ఇవే..

ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు, జ్వరం దీనికి సంకేతాలుగా చెప్పవచ్చు. క్షయవ్యాధి రోగులు రూపం, తీవ్రతను బట్టి అనేక లక్షణాలను అనుభవించవచ్చు. గుప్త క్షయవ్యాధి ఎటువంటి సంకేతాలను చూపదు. కానీ క్రియాశీల రూపంలో ఇలా ఉండదు.

ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు, జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, నాటకీయంగా బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, అలసట వంటివి ప్రధాన లక్షణాలు.

కనీసం 6-12 నెలల మందులు వాడాలి..

క్షయవ్యాధి చికిత్స ఎక్కువగా మీరు బాధపడుతున్న రకాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ TBని పెరగకుండా మందులతో కంట్రోల్ చేయవ్చచు. సాధారణంగా కోర్సు తొమ్మిది నెలల పాటు ఉంటుంది. యాక్టివ్ TBకి దాదాపు 12 నెలల మందులు అవసరమవుతాయి. డాక్టర్ సూచించిన వాటికి పూర్తిగా అంకితమై మందులు తీసుకోవాలి. చికిత్స చేయకుండా వదిలేస్తే.. TB మరణానికి దారి తీస్తుంది.

నివారణ చర్యలు

క్షయవ్యాధి నయం అయినప్పటికీ.. దాని నుంచి దూరంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, టీకాలు వేయడం, రోగులతో సంబంధాన్ని నివారించడం వంటివి మీరు అనుసరించగల కొన్ని నివారణ చర్యలు.

స్వయంగా మీరు TBతో బాధపడుతుంటే.. గాలి ద్వారా బ్యాక్టీరియా బదిలీ కాకుండా నిరోధించడానికి మీరు మాస్క్ ధరించండి. దగ్గు లేదా తుమ్ములు మీ మోచేతులను అడ్డుగా ఉంచండి.

తదుపరి వ్యాసం