తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rajma Sprouts Chaat Recipe : ప్రోటీన్ డైట్ కావాలనుకునేవారికి రాజ్మా స్ప్రౌట్స్ చాట్ ది బెస్ట్..

Rajma Sprouts Chaat Recipe : ప్రోటీన్ డైట్ కావాలనుకునేవారికి రాజ్మా స్ప్రౌట్స్ చాట్ ది బెస్ట్..

05 November 2022, 6:58 IST

    • Rajma Sprouts Chaat Recipe : ప్రోటీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడటమే కాకుండా మీ బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయం చేస్తుంది. అందుకే చాలామంది తమ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటే.. రాజ్మాతో చేసే స్ప్రౌట్స్ చాట్ ట్రై చేసేయండి మరి.
రాజ్మాతో చేసే స్ప్రౌట్స్ చాట్
రాజ్మాతో చేసే స్ప్రౌట్స్ చాట్

రాజ్మాతో చేసే స్ప్రౌట్స్ చాట్

Rajma Sprouts Chaat Recipe : ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. తద్వారా మీరు వేరే ఇతర స్నాక్స్, హెల్తీ కానీ ఫుడ్స్ జోలికి వెళ్లరు. ప్రోటీన్ ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. అందుకే ప్రోటీన్ మన డైట్లో భాగం అవ్వాలి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్​తో డే ప్రారంభించాలనుకునేవారికి ఇక్కడ ఓ రెసిపీ ఉంది. ఇది మీకు బ్రేక్​ఫాస్ట్​లా మాత్రమే కాకుండా.. స్నాక్స్, లంచ్​లా కూడా కలిసి వస్తుంది. అదే రాజ్మా స్ప్రౌట్స్ చాట్. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

కావాల్సిన పదార్థాలు

* కిడ్నీ బీన్స్ - గుప్పెడు (ముందురోజు నానబెట్టినవి)

* పెసరపప్పు - గుప్పెడు (ముందురోజు నానబెట్టినవి)

* శెనగలు - 2 స్పూన్స్ (ముందురోజు నానబెట్టినవి)

* నిమ్మరసం - 2 స్పూన్స్

* ఉల్లిపాయలు - 1 (తరగాలి)

* చాట్ మసాలా - చిటికెడు

* కొత్తిమీర - 1 స్పూన్

తయారీ విధానం

మొలకెత్తిన రాజ్మాను తీసుకుని.. దానిలో మొలకెత్తిన పెసలు, శనగలు, ఉల్లిపాయలు, కీరదోస, టమోటాలు వేయండి. దానిపై కాస్త చాట్ మసాలా వేసి బాగా కలపండి. చివరిగా దానిపై నిమ్మరసం వేసి.. బాగా మిక్స్ చేయండి. కొత్తిమీరతో గార్నీష్ చేయండి. కొత్తిమీర లేకున్నా పర్లేదు. కానీ దీనిని తింటే మాత్రం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బరువు, షుగర్ కూడా అదుపులో ఉంటుంది.

తదుపరి వ్యాసం