తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Vegetable Soup Recipe : వెజిటబుల్స్​తో చికెన్.. కలిపి సూప్​ చేసేయండి..

Chicken Vegetable Soup Recipe : వెజిటబుల్స్​తో చికెన్.. కలిపి సూప్​ చేసేయండి..

11 October 2022, 6:46 IST

    • Chicken Vegetable Soup Recipe : చలికాలం మొదలైపోయిందనే చెప్పాలి. వర్షాలతో సహా చలి కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఉదయం చాలా లేజీగా ఉంటుంది. దానిని ఫుల్ ఎనర్జీగా మార్చేయాలనుకుంటే.. వెచ్చని సూప్​ని మనం బ్రేక్​ఫాస్ట్​లా తీసుకోవాల్సిందే. అది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తూ.. మీ చలిని వదిలించేస్తుంది.
చికెన్ వెజిటబుల్ సూప్
చికెన్ వెజిటబుల్ సూప్

చికెన్ వెజిటబుల్ సూప్

Chicken Vegetable Soup Recipe : ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా చికెన్ వెజిటబుల్ సూప్​ తీసుకుంటే.. వెచ్చని ఫీలింగ్ కలుగుతుంది. పైగా దానిలో చికెన్, వెజిటెబుల్స్ మీకు శక్తిని అందిస్తాయి. జలుపు, దగ్గు వంటివాటినుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మీరు సూప్​లకు దూరంగా ఉండకండి. మరి చికెన్ వెజిటబుల్ సూప్​ని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024: ఎలాంటి మహిమలూ, మ్యాజిక్కులూ తెలియని సూపర్ హీరో అమ్మ, ఆమె ప్రేమే బిడ్డకు రక్ష

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

కావాల్సినవి

* చికెన్ - 1 కప్పు (చిన్న ముక్కలు)

* క్యారెట్ - 1 (తరిగినది)

* బఠానీలు - అర కప్పు

* మొక్కజొన్నలు - అరకప్పు

* ఒరెగానో - రుచికి సరిపడా

* బ్లాక్ పెప్పర్ - రుచికి తగినంత

* కొత్తిమీర - గార్నిష్ చేయడానికి

* ఉప్పు - తగినంత

తయారీ విధానం

చికెన్ వెజిటబుల్ సూప్ కోసం ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో.. చికెన్ వేసి.. కొద్దిగా ఉప్పు వేసి.. మెత్తబడే వరకు ఉడికించాలి. అలా చికెన్ ఉడకబెట్టిన పులుసును సేవ్ చేయండి. ఇప్పుడు పాన్‌ తీసుకుని.. దానిలో చికెన్ ఉడకబెట్టిన పులుసు, కూరగాయలు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో వేయండి.

కూరగాయలు మెత్తబడే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు చికెన్ వేసి.. మరో రెండు నిమిషాలు ఉడికించండి. చివరిగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి.. వేడి వేడిగా తాగేయండి. ఇది మీ చలిని దూరం చేసి.. మీకు వెచ్చని ఫీల్ ఇస్తూ.. మీ రోజును ఎనర్జీగా ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం