తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Melon Benefits । బూడిద గుమ్మడితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా వదలరు!

Winter Melon Benefits । బూడిద గుమ్మడితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా వదలరు!

HT Telugu Desk HT Telugu

16 January 2023, 19:30 IST

    • Winter Melon Health Benefits:  - బూడిద గుమ్మడి కాయలో గణనీయమైన మొత్తంలో గల్లిక్ యాసిడ్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ ప్రభావంగా ఉంటుంది. ఇంకా దీనితో ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
Winter Melon Health Benefits
Winter Melon Health Benefits (iStock)

Winter Melon Health Benefits

బూడిద గుమ్మడికాయ అనగానే మనకు మొట్టమొదటగా తట్టే ఆలోచన, దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి వేళాడదీసే ఒక బరువైన కాయ. కానీ ఈ బూడిద గుమ్మడికాయతో వివిధ రకాల వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? బూడిద గుమ్మడి కాయను వింటర్ మెలన్, పేటా, వ్యాక్స్ గార్డ్, సఫేద్ కద్దూ అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. దీనికి మార్కెట్‌లోనూ మంచి గిరాకీ ఉంటుంది.బూడిద గుమ్మడికాయతో రైతా చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, మిఠాయి చేసుకోవచ్చు, వడియాలు కూడా పెట్టుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Oats Egg Omelette : ఓట్స్ ఎగ్ ఆమ్లెట్.. మీ అల్పాహారాన్ని ఆరోగ్యకరంగా మార్చగలదు

Tuesday Motivation : పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనది.. కానీ ముందుగా ఈ విషయాలు చెక్ చేసుకోండి

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

అంతేకాదు, ఈ బూడిద గుమ్మడి కాయలో అనేకమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అతిగా దాహం వేయడం, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది తింటే పరిష్కారం లభిస్తుంది. దీని విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిద గుమ్మడి తీగ రసాన్ని అధిక రక్తపోటు, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.

Winter Melon Health Benefits - బూడిద గుమ్మడితో ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడి మరెన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల స్టోర్‌హౌస్. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా, మీ ఆహారంలో ఈ బూడిద గుమ్మడికాయను తప్పకుండా చేర్చుకోవాలని సూచించారు. ఎందుకోసం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన రోగనిరోధక శక్తి కోసం

బూడిద గుమ్మడిలో విటమిన్ సి , రిబోఫ్లేవిన్ ఉన్నాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, అలాగే ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి, ఆరోగ్యకరమైన కణాల మ్యుటేషన్‌ను నిరోధించడానికి యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ B2 అని కూడా పిలిచే రిబోఫ్లావిన్ మంచి మొత్తంలో ఉంటుంది, ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే సూక్ష్మపోషకం.

గుండె ఆరోగ్యానికి

బూడిద గుమ్మడిలో అధిక స్థాయిలో పొటాషియం, విటమిన్ సి ఉన్నందున ఇది హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది, అంటే ఇది రక్త నాళాలు, ధమనులలో ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తం మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఇంకా, విటమిన్ సి స్ట్రోక్ తగ్గే అవకాశాలతో నేరుగా ముడిపడి ఉంది.

ఆరోగ్యకరమైన బరువు కోసం

బూడిద గుమ్మడికాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ రకమైన ఫైబర్ మీ జీర్ణాశయంలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కాబట్టి కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అంతేకాకుండా బూడిద గుమ్మడిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతంగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు డైటింగ్‌ చేసే వారికి మంచి ఆహారం.

వృద్ధాప్య సమస్యలు తగ్గించేందుకు

బూడిద గుమ్మడికాయలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్‌తో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. తీవ్రమైన హాని కలిగించే ఫ్రీ రాడికల్ సమ్మేళనాలతో పోరాడడం ద్వారా యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో రక్షణ పాత్రను పోషిస్తాయి. అందుకే దీనిని పనితీరును కనబరిచే ఫంక్షనల్ ఫుడ్ అని పిలుస్తారు.

తదుపరి వ్యాసం