తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Foods: వీటిని రోజూ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది..

Hair Growth Foods: వీటిని రోజూ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది..

HT Telugu Desk HT Telugu

17 September 2023, 15:00 IST

  • Hair Growth Foods: జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేసే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు. అవేంటో తెలుసుకొని, మీ భోజనంలో భాగం చేసుకోండి. 

జుట్టు పెరుగుదల కోసం ఆహారాలు
జుట్టు పెరుగుదల కోసం ఆహారాలు (stock photo)

జుట్టు పెరుగుదల కోసం ఆహారాలు

మహిళలైనా, పురుషులైనా ముఖం అందంగా కనిపించాలంటే దానిలో జట్టు పాత్ర ఎంతో ఉంటుంది. జుట్టు ఒత్తుగా, నిగనిగలాడుతూ ఉంటే వారు చూసేందుకు మరింత నిండుగా కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి లాంటి కారణాల వల్ల చాలా మంది జట్టు రాలిపోవడంతో బాధ పడుతున్నారు. చివర్లు చిట్లిపోవడం, చిన్నప్పుడే నెరిసిపోవడం లాంటి అనేక కేశ సంబంధిత సమస్యలూ తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల పదార్థాలను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన జుట్టు దృఢంగా, కాంతివంతంగా ఎదుగుతుంది. ఆ ఆహారాల వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

గుడ్లు:

జట్టు ఎదుగుదలలో ప్రొటీన్‌, బయోటిన్‌ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇవి రెండూ గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి తగినంత ప్రొటీన్‌ లభించినప్పుడు జుట్టు కుదుళ్లు మరింత బలోపేతం అవుతాయి. ఎందుకంటే ఇవి అధిక భాగం ప్రొటీన్‌తోనే తయారవుతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కెరోటిన్‌ అనే ప్రొటీన్‌ ఉత్పత్తికి బయోటిన్‌ ఉపయోగపడుతుంది.

పాలకూర:

జుట్టుకు పాలకూర ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి సహకరించే పోషకాలు. కేవలం 30 గ్రాముల పాలకూరను తీసుకుంటే అది మన శరీర రోజు వారీ అవసరాల్లో సరిపోయే 20 శాతం విటమిన్‌ ఎ ని అందిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఐరన్‌.. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను మెరుగ్గా శరీరమంతా సరఫరా చేసేలా చూస్తుంది. ఫలితంగా తలలో కణాలకు మంచి ఆక్సిజన్‌ సరఫరా జరుగుతుంది. అవి ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి. జుట్టు ఎక్కువగా ఊడిపోయే వారిలో ఐరన్‌ లోపం ఉండే అవకాశాలు ఉంటాయి.

చిలగడ దుంపలు:

చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లోపలికి వెళ్లిన తర్వాత శరీరం వీటిని విటమిన్‌ ఎ గా మార్చుకుంటుంది. 100 గ్రాముల చిలగడ దుంపల్ని తినడం వల్ల రోజువారీ అవసరానికి మించి 140 శాతం వరకు ఏ విటమిన్‌ మన శరీరానికి అందుతుంది. ఏ విటమిన్‌ శరీరంలో అధికం కావడమూ ప్రమాదమే. ఇది ఎక్కువైనా, తక్కువైనా కూడా జుట్టు రాలిపోతుంది.

బీన్స్‌, సోయాబీన్స్‌:

చిక్కుడు జాతికి చెందిన బీన్స్‌, సోయాబీన్స్‌ తినడం వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్‌ లభిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సోయాబీన్స్‌లో స్పెర్మిడైన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కేశాలు పొడవు ఎదగడంలో సహకరిస్తుంది. బీన్స్‌లో జింక్‌ ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల నల్ల బీన్స్‌ తినడం వల్ల మహిళల రోజువారీ అవసరాల్లో 14 శాతం జింక్ అందుతుంది. అదే పురుషులకైతే పది శాతం జింక్‌ అందుతుంది.

నట్స్‌:

జుట్టు ఆరోగ్యంగా ఎదగాలనుకునే వారు రోజూ కొన్ని బాదాం, పిస్తా, జీడిపప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా గింజలు లాంటి వాటిని తినాలి. వీటిలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్‌ ఈ ఉంటుంది.

తదుపరి వ్యాసం