Cashew for Diabetes: డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పు తినొచ్చా?: వివరాలివే-diabetes can eat cashew nuts know the benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cashew For Diabetes: డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పు తినొచ్చా?: వివరాలివే

Cashew for Diabetes: డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పు తినొచ్చా?: వివరాలివే

Cashew Nuts for Diabetes: డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పు తొనవచ్చా.. తింటే ఎంత మోతాదులో తింటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి. అలాగే, వీటి వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏవో చూడండి.

జీడిపప్పు

Cashew Nuts for Diabetes: మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. సరైన డైట్ పాటిస్తూ ఉండాలి. షుగర్ ఉన్న వారు కొన్ని రకాల రుచికరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏం తినాలో.. తినకూడదో అనే సందేహాలు ఉంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పు (Cashew Nuts) తినొచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే, మధుమేహం ఉన్న వారు జీడిపప్పు తినవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వివరాలివే..

డయాబెటిస్ ఉన్న వారు కూడా ప్రతీ రోజు జీడిపప్పు తినవచ్చు. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్ అయిన ‘మోనోసాచురేటెడ్ ఫ్యాట్’ పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. అలాగే, వీటిలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పులో గ్లిసెమిక్ ఇండెక్స్ సుమారుగా 25 ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు జీడిపప్పును తినొచ్చు. ఇబ్బంది ఉండదు.

జీడిపప్పులో నేచురల్ షుగర్ ఉంటుంది. అందుకే వీటిని తింటే రక్తంలోని షుగల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగడం జరగదు. వీటి వల్ల డయాబెటిస్ పేషెంట్లకు మేలు జరుగుతుంది.

ఎన్ని తినొచ్చు?

అయితే, మంచిది కదా అని డయాబెటిస్ ఉన్న జీడిపప్పు అతిగా తినకూడదు. మోస్తరుగా తీసుకోవాలి. రోజులో 10 వరకు తింటే బెస్ట్. ఇతర ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ జీడిపప్పును తినాలి. ఇలా, మోతాదు మేర జీడిపప్పు తింటే డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. స్నాక్స్‌గా జీడిపప్పును తినవచ్చు.

జీడిపప్పును తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. పొటాషియమ్, విటమిన్ ఈ, విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియమ్, ఫైబర్.. జీడిపప్పులో ఉంటాయి. మలబద్ధకం ఉన్న వారు జీడిపప్పు తింటే ఉపశమనం కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే పరిమితి మేరనే తీసుకోవాలి.

ఒకవేళ పరిమితికి మించి విపరీతంగా జీడిపప్పును తింటే జీర్ణం అయ్యేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కడుపునొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఎవరైనా జీడిపప్పును పరిమితి మేరకే తింటే మేలు.