తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Period Face Mask : ట్రెండింగ్​లో పీరియడ్ బ్లడ్​ ఫేస్ మాస్క్.. నిజంగానే చర్మానికి మంచిదా?

Period Face Mask : ట్రెండింగ్​లో పీరియడ్ బ్లడ్​ ఫేస్ మాస్క్.. నిజంగానే చర్మానికి మంచిదా?

08 December 2022, 22:00 IST

    • Period Face Mask : బ్యూటీ ట్రెండ్‌లు వస్తాయి.. వెళ్తాయి. చర్మ సంరక్షణ లేదా జుట్టు సంరక్షణ ఉత్పత్తిగా ఏ పండో లేదా కూరగాయలో సడెన్​గా తెరపైకి వస్తాయి. అయితే తాజాగా పీరియడ్ బ్లెడ్ ఫేస్ మాస్క్ ట్రెండ్​లోకి వచ్చింది. మరి ఇది నిజంగానే చర్మానికి మంచిదా? కాదా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీరియడ్ బ్లెడ్ ఫేస్ మాస్క్
పీరియడ్ బ్లెడ్ ఫేస్ మాస్క్

పీరియడ్ బ్లెడ్ ఫేస్ మాస్క్

Period Face Mask : పీరియడ్ రక్తాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగిస్తారా? అసలు పీరియడ్స్ అంటేనే అదొక అపచారం లెక్క ఇంకా చూస్తున్న రోజుల్లో.. ఇప్పుడు అది ఓ బ్యూటీ ట్రెండ్ అయింది. దీని గురించి తెలుసుకోవాలని చాలా మంది మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే.. పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్ ప్రస్తుతం బ్యూటీ ట్రెండ్​లలో అగ్రస్థానంలో ఉంది. #periodfacemask హ్యాష్‌ట్యాగ్ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

పేరు తగ్గట్లుగానే.. ఇది మీ సొంత పీరియడ్స్ రక్తంతో తయారు చేసే ఫేస్ మాస్క్. చాలా మంది యువతులు దీనితో DIY ఫేస్ మాస్క్‌ చేసి.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరికి దీనిని ప్రయత్నించడం ప్రయోగాత్మకంగా ఉంటే.. మరికొందరు పీరియడ్ ఫేస్ మాస్క్‌ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ఇంతకీ ఈ పీరియడ్ ఫేస్ మాస్క్‌లు నిజంగా పనిచేస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధాప్యమనేది మన చర్మం ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి చర్మ పునరుజ్జీవన పద్ధతులు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ఇంట్లో తయారుచేసిన లేదా DIY ఫేస్ ప్యాక్‌లపై ఆధారపడని చాలా మంది.. యవ్వనంగా కనిపించడానికి ఫిల్లర్లు లేదా లేజర్ థెరపీకి వెళ్తున్నారు. మరి కొందరు తమ చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన బ్యూటీ ట్రీట్‌మెంట్‌ల కోసం చూస్తున్నారు. కిచెన్​లో ఉండేవి.. గార్డెన్​లో దొరికే రకరకాల ఫ్రూట్స్, కూరగాయలతో ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

పీరియడ్ బ్లడ్​తో ఫేస్ మాస్క్..

అయితే ఈ కొత్త బ్యూటీ ట్రెండ్ విషయానికొస్తే.. దీనితో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. మీ పీరియడ్ బ్లడ్‌ని సేకరించి ఒక కంటైనర్‌లో ఉంచండి. దానిని మీ ముఖమంతా పూయండి. ఇది అపరిశుభ్రంగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ మెరుసే చర్మం పొందాలనే ఆశతో చాలామంది ఈ బ్లడ్​ని ఫేస్ మాస్క్​గా వేసుకుంటున్నారు. కానీ ఈ విచిత్రమైన బ్యూటీ ట్రెండ్‌ని ప్రయత్నించడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

పీరియడ్ బ్లడ్‌ను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం అంత సురక్షితం కాదు అంటున్నారు నిపుణులు. మెరిసే చర్మం గురించి పక్కన పెడితే.. ఇది చర్మ వ్యాధులకు దారితీయవచ్చు అంటున్నారు. ప్రత్యేకించి మీకు ఇప్పటికే యోని లేదా గర్భాశయ సంక్రమణం ఉన్నట్లయితే ఇది ప్రమాదకరమైనదని కూడా నిరూపించవచ్చని తెలిపారు.

వాస్తవానికి వాంపైర్ ఫేషియల్ కూడా బ్లడ్​తో చేస్తారు కానీ.. పీరియడ్ బ్లడ్​తో కాదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. ఈ వాంపైర్ ఫేషియల్ ముడతలను తగ్గిస్తుంది. వాడిపోయిన చర్మాన్ని బొద్దుగా చేస్తుంది. అంతేకాకుండా ఇది మీ ఛాయను మెరుగుపరిచి.. మొటిమలను తగ్గిస్తుంది. అయితే వాంపైర్ ఫేషియల్, పీరియడ్ ఫేస్ ప్యాక్ ఒకే విధమైన ఫలితాలను ఇవ్వవు అని నిపుణులు తెలిపారు.

కాబట్టి ఈ ట్రెండ్​ పక్కన పెట్టి.. స్పష్టమైన, మెరుసే చర్మం కోసం.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం మంచిదంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యంగా తినండి. వ్యాయామం చేయండి. హైడ్రేటెడ్​గా ఉండండి. బాగా నిద్రపోండి. ఇవన్నీ చేస్తే అందమైన, మెరిసే స్కిన్ మీ సొంతం.

టాపిక్

తదుపరి వ్యాసం