తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Motovolt Urbn E-bike | ఈ బైక్ నడపటానికి లైసెన్స్ అవసరం లేదు!

MotoVolt URBN e-bike | ఈ బైక్ నడపటానికి లైసెన్స్ అవసరం లేదు!

HT Telugu Desk HT Telugu

27 September 2022, 23:31 IST

    • మోటోవోల్ట్- కంపెనీ సరికొత్త MotoVolt URBN e-bike ను విడుదల చేసింది. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వివరాలు చూడండి
MotoVolt URBN e-bike
MotoVolt URBN e-bike

MotoVolt URBN e-bike

కోల్‌కతాకు చెందిన EV స్టార్టప్ మోటోవోల్ట్ (Motovolt Mobility Pvt Ltd) తమ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ URBN ఇ-బైక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. URBN ఇ-బైక్ అనేది మోడ్రన్ యువతను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన జీరో-ఎమిషన్స్ ఎలక్టిక్ బైక్. MotoVolt URBN ఇ-బైక్ ధర, రూ. 49,999/- గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు తమ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అలాగే 100+ ఫిజికల్ రిటైల్ పాయింట్‌లలో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. కేవలం రూ.99 టోకెన్ ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Pulihora Recipe : ఆలయంలో ప్రసాదంలా రుచికరమైన పులిహోర చేయండి ఇలా..

Worst Egg Combination : గుడ్లతో కలిపి తినకూడని ఆహారాలు.. సైడ్‌కి ఆమ్లెట్ కూడా వద్దండి

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

ఈ ఇ-బైక్‌ని ప్రత్యేకంగా రైడర్‌ల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినది. ఇందులో BIS-ఆమోదం పొందిన తొలగించగల బ్యాటరీ ఉంటుంది. ఇది సురక్షితమైనది, ఛార్జ్ చేయడం కూడా సులభం. ఇంకా ఈ URBN ఇ-బైక్‌ పెడిల్ అసిస్ట్ సెన్సార్‌ను కలిగి ఉంది. పెడ్లింగ్ చేసుకోవటానికి లేదా ఆటోమేటిక్ రైడ్ కోసం మార్చుకోవటానికి బహుళ రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.

MotoVolt URBN ebike బ్యాటరీ, డ్రైవింగ్ పరిధి

URBN ఎలక్ట్రిక్ బైక్ లో 36V లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. దీన్ని ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే సుమారు 120 కిమీల రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 10 సెకన్లలోనే 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

అంతేకాదు, ఈ URBN ఇ-బైక్‌ నడపటానికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

ఇంకా, ఇగ్నిషన్ కీ స్విచ్, హ్యాండిల్-లాక్ వంటి ఫీచర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌ఫోన్ Sతో వస్తుంది.

ఆఫీసులకు వెళ్లే వారికి, కళాశాల లేదా పాఠశాల విద్యార్థులకు, పొలంపనులకు వెళ్లేవారికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం