తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Exercises: మెదడుకు పదునుపెట్టే వ్యాయామాలివే ! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

Brain Exercises: మెదడుకు పదునుపెట్టే వ్యాయామాలివే ! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

HT Telugu Desk HT Telugu

02 November 2023, 17:30 IST

  • Brain Exercises: శరీరానికే కాదు.. మెదడుకు మేత లాగా పనిచేసే కొన్ని వ్యాయామాలు ఎప్పుడూ చేయాలి. దానిద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలం, ఆలోచనా శక్తి బాగుంటుంది. అలాంటి వ్యాయామాలేంటో తెలుసుకుందాం. 

మెదడుకు పదును పెట్టే ఆటలు
మెదడుకు పదును పెట్టే ఆటలు (pexels)

మెదడుకు పదును పెట్టే ఆటలు

మనం ఏదైనా విషయం గురించి సరిగ్గా ఆలోచించాలన్నా, సరైన నిర్ణయం తీసుకోవాలన్నా మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది అనేక నాడుల సమూహం అని చెబుతారు కదా. అవన్నీ ఆరోగ్యంగా ఉండి, సరిగ్గా పని చేస్తేనే మనం తెలివిగా ప్రవర్తించ గలుగుతాం. లేకపోతే జ్ఞాపక శక్తి కోల్పోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తికమక పడటం.. లాంటివి జరుగుతాయి. మరి మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. వాటిని రోజూ ఆచరించడం వల్ల మన మెదడు మరింత షార్ప్‌గా తయారవుతుంది. వీటిని ఎక్సర్‌సైజులుగా భావించి కొందరిపై కొన్ని కొన్ని అధ్యయనాలు జరిగాయి. ఆ ఫలితాలు చూశక పరిశోధకులే ఆశ్చర్యపోయారు. వారిలో మెదడు పని తీరు అంతగా మెరుగుపడిందట మరి. అవేంటో తెలుసుకుందామా?

ట్రెండింగ్ వార్తలు

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

జిగ్సా పజిల్స్‌ ఆడండి :

కొన్ని ముక్కలన్నీ సరైన పద్ధతిలో కలిపితే ఓ ఆకారం వస్తుంది కదా. ఇలాంటి జిగ్సా పజిల్స్‌ మార్కెట్‌లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా చిన్న పిల్లలే ఆడుకుంటారని అనుకుంటారు. పెద్దవారూ వీటిని అప్పుడప్పుడూ ఆడుతూ ఉండండి. అందువల్ల మెదడు మరింత చురుకుగా పని చేయడం మొదలుపెడతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.

సొలిటర్‌ గేమ్స్‌ :

కంప్యూటర్లో కొన్ని సొలిటర్‌ కార్డ్‌ గేమ్స్‌ ఉంటాయి కదా. అవేనండీ పేకలతో అంకెలు సెట్‌ చేసే ఆటల్లాంటివి. వాటిని ఆడటం వల్లా మెదడులో కొన్ని భాగాలు ఎక్కువగా ఉత్తేజితం అవుతాయి. అందువల్ల మన మెదడు మరింత పదును దేలుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కంప్యూటర్లో కొన్ని రకాల కార్డ్స్‌ని ఆడుతూ ఉండమని పరిశోధకులు చెబుతున్నారు.

భాషను మరింత పెంచుకోండి :

మిమ్మల్ని మీరు బాగా పరీక్షించి చూసుకోండి. ఎక్కువగా మీరు రాయడానికి, మాట్లాడటానికి కొద్ది పదాలను మాత్రమే వాడుతూ ఉంటారు. అలా కాకుండా భాషా పరిధిని మరింత పెంచుకోండి. కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోండి. వాటిని వాడేందుకు ప్రయత్నించండి. అలాగే కొత్త భాషలు నేర్చుకోండి. ఎక్కువ భాషల్ని నేర్చుకోవడం వల్ల మెదడు మరింత చురుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

సంగీతం వినడం, డ్యాన్స్‌ చేయడం :

సంగీతం వినడం, దాన్ని ఇతరులకు నేర్పించడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితం అవుతాయి. అలాగే మనసారా డ్యాన్స్‌ చేయడం వల్లా మెదడు నరాల పని తీరు మెరుగవుతుంది. 2017లో జరిగిన ఓ అధ్యయనంలో ఫీల్‌ గుడ్‌ మ్యూజిక్‌ని వినడం వల్ల మెదడు శక్తివంతం అవుతుందని తేలింది. దీని వల్ల క్రియేటివ్‌ స్కిల్స్‌ పెరుగుతాయని వెల్లడైంది.

టాపిక్

తదుపరి వ్యాసం