Wordle facts| పదాల ఆట.. పజిల్స్‌తో మెదడుకు మేత..!-these are the 5 facts to know about the viral word puzzle game wordle ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wordle Facts| పదాల ఆట.. పజిల్స్‌తో మెదడుకు మేత..!

Wordle facts| పదాల ఆట.. పజిల్స్‌తో మెదడుకు మేత..!

Maragani Govardhan HT Telugu
Feb 27, 2022 07:00 AM IST

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న గేమ్ వార్డిల్ (Wordle). ఈ పజిల్ గేమ్‌కు 2022లో అభిమానులను విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో వార్డిల్ వైరల్ అవుతోంది. యువత ఎక్కువగా ఈ రోజువారీ పజిల్ గేమ్‌ను ఆడుతున్నారు.

<p>వార్డిల్</p>
వార్డిల్ (Hindustan times)

గేమింగ్ ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకుంటోంది. ఓ పక్క బ్యాటిల్ గ్రౌండ్ లాంటి యాక్షన్ గేమ్స్‌కు క్రేజ్ విపరీతంగా ఉండగా.. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ఆటల కోసం కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు గేమింగ్ ప్రియులు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న గేమ్ వార్డిల్ (Wordle). ఈ పజిల్ గేమ్‌కు 2022లో అభిమానులను విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో వార్డిల్ వైరల్ అవుతోంది. యువత ఎక్కువగా ఈ రోజువారీ పజిల్ గేమ్‌ను ఆడుతున్నారు. మరి 2022లో ట్రెండ్ అవుతోన్న ఈ వార్డిల్ గేమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

2022లో తొలి ట్రెండీ గేమ్..

రోజువారీగా వార్డిల్ స్టోరీని పంచుకోవడం వల్ల ట్విట్టర్‌లో ఈ గేమ్ ట్రెండ్ అవుతోంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పజిల్ గేమ్‌ హైప్ ఒక్కసారిగా పెరిగిపోయి 2022లో ట్రెండ్ అవుతోన్న తొలి గేమ్‌గా వార్డిల్ గుర్తింపు తెచ్చుకుంటోంది. గత అక్టోబరులో ఇది విడుదలైనప్పటి నుంచి ఎక్కువ మంది ప్రస్తావించిన ఈ ఆటగా ట్విట్టర్ పేర్కొంది. 2022 జనవరి 14 నాటికి దాదాపు 840,000 సార్లు ఈ గేమ్ గురించి మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ప్రస్తావించినట్లు స్పష్టం చేసింది. ట్విట్టర్ వేదికగా భారత్‌లో 96 శాతం వార్డిల్ సంభాషణలు జనవరిలోనే జరిగాయని తెలిపింది. భారతీయులు ఎక్కువగా మక్కువ పెంచుకున్న ఈ గేమ్ స్థిరంగా పాపులారిటీని సంపాదించుకుంటోంది. దేశంలో రోజూ వర్డ్లే సంభాషణలు 48 శాతం వృద్ధితో కొనసాగుతోందని వెల్లడించింది.

వార్డిల్ ఎలా వచ్చింది..

ఈ పజిల్ గేమ్‌ను అక్టోబరు 2021లో జోష్ వర్డ్లే అనే వ్యక్తి రూపొందించాడు. తన భాగస్వామి పాలక్ షాతో కలిసి ఈ ఆటను క్రియేట్ చేశాడు. అక్టోబరులో ఇది విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. యాదృచ్ఛికంగా ఆర్డర్ చేసిన 2,315 పదాలను లిస్ట్ చేసి రాండమైజేషన్ ఆల్గారిథమ్‌తో ఈ గేమ్‌ పనిచేస్తుంది. అంటే ఎప్పుడు ఏ పదం వస్తుందో తెలుసుకోవడం కష్టం. దీన్ని సృష్టించిన జోష్‌కు సైతం ఈ గేమ్‌లో తర్వాత ఏ పదం పాపప్ అవుతుందో తెలియదు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఈ ఆటపై ఎంతో ఆస్వాదిస్తున్నారు.

పదాల యుద్ధం..

వార్డిల్ పజిల్ గేమ్‌లో యూకే ఇంగ్లీష్‌కు బదులు అమెరికన్ ఇంగ్లీష్‌ను ఉపయోగించారు. అంటే యూఎస్ పదాల స్లెల్లింగ్స్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఫలితంగా యూకే గేమింగ్ ప్రియులు ఈ ఆటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పదాల స్పెల్లింగ్, అర్థం వేరే ఉండటమే ఇందుకు కారణం. ఇది సాధారణ అమెరికన్ పదాలను ఉపయోగించేవారికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. వార్డిల్‌ను సాల్వ్ చేసేటప్పుడు ఆటగాడు అనేక పదాల స్పెల్లింగ్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.

నకిలీ గేమ్స్..

ఏదైనా ఆట మార్కెట్‌లోకి విడుదలైందంటే దానికి ప్రత్యామ్నాయంగా లేదా పోలి ఉండే నకిలీ(Clone) గేమ్స్ వెల్లువెత్తుతాయి. వార్డిల్‌ను ఏ బ్రౌజర్, ప్లాట్‌ఫాం నుంచైనా సులభంగా యాక్సెస్ చేయగలిగే ఉచిత గేమ్. అంతేకాకుండా ఈ ఆటను మానిటైజ్ చేయనని ఈ ఆట సృష్టికర్త ఇప్పటికే ప్రకటించారు. ఫలితంగా ఇంది ఎంతోమంది గేమింగ్ డెవలపర్లు ఈ ఆటలోని ప్రధాన అంశాలను తీసుకొని తమ గేమ్స్ లేదా యాప్స్‌లో కాపీ చేయకుండా నిరోధించడం కష్టమవుతుంది. ఈ నకిలీ ఆటల్లో ఉన్న ప్రధాన వ్యత్యాసం యాడ్స్‌తో నిండి ఉంటాయి.

ఇప్పటికే 'వార్డిల్-ది యాప్' అనే నకిలీ వార్డిల్ ఆటను జాక్ ష్యాక్డ్ అనే వ్యక్తి సృష్టించాడు. అంతేకాకుండా అపరిమిత సంఖ్యలో సభ్యలను ఆహ్వానించి వారి వార్షిక సభ్యత్వాన్ని 30 డాలర్లకు అందించడం ప్రారంభించాడు. ఇలాంటి క్లోన్ వార్డిల్ గేమ్స్ రోజూ వెల్లువెత్తుతున్నాయి. చివరకు జాక్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. తాను రూపొందించిన క్లోన్ యాప్‌మి తీసివేసి బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టలేదు.

నకిలీ గేమ్స్ మాదిరిగా కాకుండా యాప్ స్టో‌ర్‌లో వార్డిల్ అందుబాటులో ఉంది. భిన్నమైన వర్డ్ బేస్‌లో("Wordle!") అని ఉంటుంది. ఒరిజినల్ గేమ్ డెవలపర్ అయిన స్టీవెన్ క్రావోట్టా ఇప్పుడు తన ‘Wordle!’ యాప్ ద్వారా సంపాదించిన ఏదైనా డబ్బును స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వడానికి సరికొత్త బ్రౌజర్ ఆధారిత గేమ్ డెవలపర్ జోష్ వార్డిల్‌తో జతకట్టినట్లు నివేదించబడింది. యాప్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఓక్‌లాండ్‌లోని యువకులకు ట్యూటర్, మెంటార్‌గా ఉండేలా కాలిఫోర్నియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ బూస్ట్‌ఓక్‌ల్యాండ్‌కు విరాళంగా అందిస్తారు.

గేమింగ్ ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకుంటోంది. ఓ పక్క బ్యాటిల్ గ్రౌండ్ లాంటి యాక్షన్ గేమ్స్‌కు క్రేజ్ విపరీతంగా ఉండగా.. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ఆటల కోసం కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు గేమింగ్ ప్రియులు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న గేమ్ వార్డిల్ (Wordle). ఈ పజిల్ గేమ్‌కు 2022లో అభిమానులను విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో వార్డిల్ వైరల్ అవుతోంది. యువత ఎక్కువగా ఈ రోజువారీ పజిల్ గేమ్‌ను ఆడుతున్నారు. మరి 2022లో ట్రెండ్ అవుతోన్న ఈ వార్డిల్ గేమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2022లో తొలి ట్రెండీ గేమ్..

రోజువారీగా వార్డిల్ స్టోరీని పంచుకోవడం వల్ల ట్విట్టర్‌లో ఈ గేమ్ ట్రెండ్ అవుతోంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పజిల్ గేమ్‌ హైప్ ఒక్కసారిగా పెరిగిపోయి 2022లో ట్రెండ్ అవుతోన్న తొలి గేమ్‌గా వార్డిల్ గుర్తింపు తెచ్చుకుంటోంది. గత అక్టోబరులో ఇది విడుదలైనప్పటి నుంచి ఎక్కువ మంది ప్రస్తావించిన ఈ ఆటగా ట్విట్టర్ పేర్కొంది. 2022 జనవరి 14 నాటికి దాదాపు 840,000 సార్లు ఈ గేమ్ గురించి మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ప్రస్తావించినట్లు స్పష్టం చేసింది. ట్విట్టర్ వేదికగా భారత్‌లో 96 శాతం వార్డిల్ సంభాషణలు జనవరిలోనే జరిగాయని తెలిపింది. భారతీయులు ఎక్కువగా మక్కువ పెంచుకున్న ఈ గేమ్ స్థిరంగా పాపులారిటీని సంపాదించుకుంటోంది. దేశంలో రోజూ వర్డ్లే సంభాషణలు 48 శాతం వృద్ధితో కొనసాగుతోందని వెల్లడించింది.

వార్డిల్ ఎలా వచ్చింది..

ఈ పజిల్ గేమ్‌ను అక్టోబరు 2021లో జోష్ వర్డ్లే అనే వ్యక్తి రూపొందించాడు. తన భాగస్వామి పాలక్ షాతో కలిసి ఈ ఆటను క్రియేట్ చేశాడు. అక్టోబరులో ఇది విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. యాదృచ్ఛికంగా ఆర్డర్ చేసిన 2,315 పదాలను లిస్ట్ చేసి రాండమైజేషన్ ఆల్గారిథమ్‌తో ఈ గేమ్‌ పనిచేస్తుంది. అంటే ఎప్పుడు ఏ పదం వస్తుందో తెలుసుకోవడం కష్టం. దీన్ని సృష్టించిన జోష్‌కు సైతం ఈ గేమ్‌లో తర్వాత ఏ పదం పాపప్ అవుతుందో తెలియదు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఈ ఆటపై ఎంతో ఆస్వాదిస్తున్నారు.

పదాల యుద్ధం..

వార్డిల్ పజిల్ గేమ్‌లో యూకే ఇంగ్లీష్‌కు బదులు అమెరికన్ ఇంగ్లీష్‌ను ఉపయోగించారు. అంటే యూఎస్ పదాల స్లెల్లింగ్స్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఫలితంగా యూకే గేమింగ్ ప్రియులు ఈ ఆటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పదాల స్పెల్లింగ్, అర్థం వేరే ఉండటమే ఇందుకు కారణం. ఇది సాధారణ అమెరికన్ పదాలను ఉపయోగించేవారికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. వార్డిల్‌ను సాల్వ్ చేసేటప్పుడు ఆటగాడు అనేక పదాల స్పెల్లింగ్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.

నకిలీ గేమ్స్..

ఏదైనా ఆట మార్కెట్‌లోకి విడుదలైందంటే దానికి ప్రత్యామ్నాయంగా లేదా పోలి ఉండే నకిలీ(Clone) గేమ్స్ వెల్లువెత్తుతాయి. వార్డిల్‌ను ఏ బ్రౌజర్, ప్లాట్‌ఫాం నుంచైనా సులభంగా యాక్సెస్ చేయగలిగే ఉచిత గేమ్. అంతేకాకుండా ఈ ఆటను మానిటైజ్ చేయనని ఈ ఆట సృష్టికర్త ఇప్పటికే ప్రకటించారు. ఫలితంగా ఇంది ఎంతోమంది గేమింగ్ డెవలపర్లు ఈ ఆటలోని ప్రధాన అంశాలను తీసుకొని తమ గేమ్స్ లేదా యాప్స్‌లో కాపీ చేయకుండా నిరోధించడం కష్టమవుతుంది. ఈ నకిలీ ఆటల్లో ఉన్న ప్రధాన వ్యత్యాసం యాడ్స్‌తో నిండి ఉంటాయి.

ఇప్పటికే 'వార్డిల్-ది యాప్' అనే నకిలీ వార్డిల్ ఆటను జాక్ ష్యాక్డ్ అనే వ్యక్తి సృష్టించాడు. అంతేకాకుండా అపరిమిత సంఖ్యలో సభ్యలను ఆహ్వానించి వారి వార్షిక సభ్యత్వాన్ని 30 డాలర్లకు అందించడం ప్రారంభించాడు. ఇలాంటి క్లోన్ వార్డిల్ గేమ్స్ రోజూ వెల్లువెత్తుతున్నాయి. చివరకు జాక్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. తాను రూపొందించిన క్లోన్ యాప్‌మి తీసివేసి బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టలేదు.

నకిలీ గేమ్స్ మాదిరిగా కాకుండా యాప్ స్టో‌ర్‌లో వార్డిల్ అందుబాటులో ఉంది. భిన్నమైన వర్డ్ బేస్‌లో("Wordle!") అని ఉంటుంది. ఒరిజినల్ గేమ్ డెవలపర్ అయిన స్టీవెన్ క్రావోట్టా ఇప్పుడు తన ‘Wordle!’ యాప్ ద్వారా సంపాదించిన ఏదైనా డబ్బును స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వడానికి సరికొత్త బ్రౌజర్ ఆధారిత గేమ్ డెవలపర్ జోష్ వార్డిల్‌తో జతకట్టినట్లు నివేదించబడింది. యాప్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఓక్‌లాండ్‌లోని యువకులకు ట్యూటర్, మెంటార్‌గా ఉండేలా కాలిఫోర్నియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ బూస్ట్‌ఓక్‌ల్యాండ్‌కు విరాళంగా అందిస్తారు.|#+|

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.