తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millet Dosa Recipe । ఆరోగ్యమైనవి తినండి, ఆరోగ్యంగా ఉండండి.. మిల్లెట్ దోశ రెసిపీ ఇదిగో!

Millet Dosa Recipe । ఆరోగ్యమైనవి తినండి, ఆరోగ్యంగా ఉండండి.. మిల్లెట్ దోశ రెసిపీ ఇదిగో!

HT Telugu Desk HT Telugu

03 February 2023, 6:06 IST

    • Millet Dosa Recipe: అల్పాహారం రోజులో తినే అన్నింటికంటే ముఖ్యమైన ఆహారం. కాబట్టి ఆరోగ్యకరంగా తినండి, మిల్లెట్ దోశ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Millet Dosa Recipe
Millet Dosa Recipe (Freepik)

Millet Dosa Recipe

చాలా మందికి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే వారి లిస్టులో దోశ అగ్రస్థానంలో ఉంటుంది. వేడివేడి, రుచికరమైన దోశ ఏ సమయంలోనైనా తినాలనిపిస్తుంది. దోశల్లో చాలా వెరైటీలు ఉంటాయని మనకు తెలుసు, కానీ వాటికి ఉపయోగించే పిండి ఒకటే అయి ఉంటుంది. అయితే అదే పిండి కాకుండా మరింత ఆరోగ్యకరమైన మిల్లెట్ల పిండిని ఉపయోగించి చేసే మిల్లెట్ దోశ, రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

మిల్లెట్ దోశలో తృణధాన్యాలను ఉపయోగిస్తాం. వీటిలో మంచి మొత్తంలో ప్రోటీన్, పిండి పదార్థాలు, ఖనిజాలు, ఐరన్‌ వంటి పోషకాలతో పాటు ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజూ ఇలాంటి మిల్లెట్ దోశ చేసుకోని తింటే రోజంతా మంచి శక్తి లభిస్తుంది. ఇవి పసిపిల్లలతో సహా అన్ని వయసుల వారికి మంచివి. మరి మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ చూడండి. మెల్లెట్ దోశ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం మిల్లెట్ దోశను సులభంగా చేసుకోవచ్చు.

Millet Dosa Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు మిల్లెట్లు
  • 1/2 కప్పు మినపపప్పు
  • 1/2 కప్పు బియ్యం
  • 1/2 టీస్పూన్ ఉప్పు
  • 3 నుండి 4 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి
  • సరిపడా నీరు

మిల్లెట్ దోశ తయారీ విధానం

  1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో బియ్యం, మిల్లెట్లు వేసి కనీసం మూడుసార్లు బాగా కడగాలి. మరొక గిన్నెలో మినపపప్పును తీసుకొని బాగా కడగాలి.
  2. ఇప్పుడు ఈ రెండింటి సుమారు 4 గంటలు నానబెట్టండి. బియ్యం, మిల్లెట్లు ఒక గిన్నెలో, మినపపప్పు వేరొక గిన్నెలో నానబెట్టాలి.
  3. నానబెట్టిన అనంతరం వీటిని గ్రెండర్లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
  4. అనంతరం ఈ మెత్తటి పిండిలను అన్ని పిండిలను ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.
  5. పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి, అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి.
  6. ఇప్పుడు దోస పెనంను వేడి చేసి , నూనె లేదా నెయ్యితో గ్రీజ్ చేసి దోశలు వేసుకోండి. నూనె చిలకరించి రెండు వైపులా దోశను కాల్చాలి.

అంతే మిల్లెట్ దోశ రెడీ, మీకు నచ్చిన చట్నీతో ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.

తదుపరి వ్యాసం