తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smoking Effect : సిగరేట్ మానేయపోతే.. రెండు గాజులు అమ్ముకోవాల్సిందే

Smoking Effect : సిగరేట్ మానేయపోతే.. రెండు గాజులు అమ్ముకోవాల్సిందే

Anand Sai HT Telugu

03 February 2023, 10:15 IST

    • Smoking Effect : ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రతి ఒక్కరూ చెప్పేదే. కానీ అలవాటు అయినవారు మాత్రం.. మానకుండా ఉండలేరు. సిగరేట్ మరిచిపోవాలంటే.. తపస్సులాగా చేయాలని చెబుతారు. కానీ సిగరేట్ తాగడం అలానే కంటిన్యూ చేస్తే.. సినిమాకు ముందు వచ్చే యాడ్ లాగా రెండు గాజులు అమ్ముకోవాల్సిన పరిస్థితే వస్తుంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం
ధూమపానం ఆరోగ్యానికి హానికరం (Unsplash)

ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ధూమపానం(Smoking) కూడా ఆత్మహత్య చేసుకోవడంలాంటిదే. కాకపోతే.. తనను తాను చంపుకొనేందుకు కాస్త సమయం తీసుకుంటూ సిగరేట్ తాగుతూ.. వెళ్తారన్నమాట. 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం'.. రోజు వారీ జీవితంలో చాలా సార్లు ఈ సందేశాన్ని చూస్తాం. కానీ అలవాటు అయినవారు మాత్రం.. ఈ వ్యసనాన్ని వదిలిపెట్టరు. ఒక్కసారి సిగరేట్(Cigarette) తాగడం అలవాటైతే.. మీరు దానికి ఖైదీలా మారిపోతారు. మీతోపాటుగా చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంటారు. పొగతాగడం వలన ఎన్నో రోగాలు వస్తుంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

పొగాకు నమలడం, లేదా సిగరేట్ రూపంగా తాగడంలాంటివి కనిపిస్తుంటాయి. పొగాకులో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది. దీనికి అడిక్ట్(Addict) అయ్యే.. చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. ధూమపానం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన సమస్యలకు కూడా దారితీయవచ్చు. ధూమపానం శ్వాసకోశ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, చర్మం, కళ్ళు మొదలైన వాటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం వల్ల మధుమేహం(Diabetes) ఎక్కువవుతుందని చెబుతున్నారు. దీనితోపాటుగా అనేక ఇతర సమస్యలను కూడా వస్తాయి.

ధూమపానం ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుంది. ఎందుకంటే ధూమపానం చేసేవారు నికోటిన్(Nicotine) పీల్చేస్తారు. దీని కారణంగా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.

ధూమపానం గుండె, రక్త నాళాలు, రక్త కణాలకు హాని కలిగిస్తుంది. సిగరెట్‌లోని రసాయనాలు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్త నాళాలలో ఫలకం ఏర్పడటానికి దారితీస్తుంది. దీనితో రక్త ప్రవాహం మీద ప్రభావం పడుతుంది. అడ్డుపడటానికి దారితీస్తుంది.

ధూమపానంతో స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇబ్బందే. పిల్లలు అవడం కష్టం. ధూమపానం స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది గర్భం దాల్చడం కష్టతరం చేస్తుంది. ఎందుకంటే సిగరెట్లలో ఉండే పొగాకు హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.

ధూమపానం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గడానికి ఇది ముఖ్యంగా ఉంటుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో శరీరంలో మంట కూడా పెరుగుతుంది.

ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌(Cancer)తో పాటు ఇతర క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని చెబుతారు. దీనితో పాటు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి రిస్క్ కూడా పెరుగుతుంది.

తదుపరి వ్యాసం