తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fish Fry Curry : ఫిష్ ఫ్రై కర్రీ.. లొట్టలేసుకుంటూ తింటారు

Fish Fry Curry : ఫిష్ ఫ్రై కర్రీ.. లొట్టలేసుకుంటూ తింటారు

Anand Sai HT Telugu

11 February 2024, 11:09 IST

    • Fish Fry Curry Recipe : చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం. దీనిని రకరకాలుగా చేసుకోవచ్చు. చేపల ఫ్రై చేసుకుని కర్రీ చేస్తే రుచి చాలా బాగుంటుంది.
ఫిష్ ఫ్రై కర్రీ
ఫిష్ ఫ్రై కర్రీ (Unsplash)

ఫిష్ ఫ్రై కర్రీ

నాన్ వెజ్ తినేవారిలో చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. వీటిని ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చేపలు చాలా మేలు చేస్తాయి. చేపల కూరను ఎవరుపడితే వారు వండితే రుచి సెట్ కాదు. సరైన పద్ధతిలో వండాలి. చేపల పులుసును ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయండి.

ట్రెండింగ్ వార్తలు

Milk Ghee Benefits : రాత్రి పడుకునే ముందు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాగండి

Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!

Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Never Eat Foods : ఖాళీ కడుపుతో ఈ 5 ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసుకోండి

చేపల పులుసును చాలా రకాలుగా చేసుకోవచ్చు. చేపలను కొద్దిగా వేయించి చేసే చేప పులుసు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలతో చేసే ఈ చేప పులుసు ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు

చేపలు 1/2 కిలో(పెద్ద చేప ముక్కలు బాగుంటాయి), 1/2 tsp అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు పొడి (1/2 tsp), 1/2 tsp కాశ్మీరీ కారం పొడి, 1/4 tsp ఉప్పు. వీటిని కలిపి.. 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బాణలిలో వేసి రెండు వైపులా వేయించాలి.

పులుసుకు కావాల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర గింజలు, 2-3 ఉల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పండిన టొమాటోలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి , 1/2 సోంపు, 1/4 కప్పు కొబ్బరి పాలు, కొద్దిగా కరివేపాకు, 11/2 టీస్పూన్ మసాలా, 1/2 టీస్పూన్ నిమ్మరసం

చేపల కర్రీ తయారు చేసే విధానం

1.1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, సోంపు, తరువాత ఉల్లిపాయ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

2.ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మళ్లీ 2 నిమిషాలు వేయించాలి.

3. తర్వాత టొమాటో వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.

4. పసుపు, గరం మసాలా పొడి వేసి నూనె పైకి వచ్చే వరకు వేడి చేయండి.

5. తర్వాత ఉప్పు వేసి కలపాలి. కొబ్బరి పాలు జోడించండి.

6. ఇప్పుడు వేయించిన చేపలను వేసి, కరివేపాకు వేసి, కాసేపు ఉడకబెట్టాలి.

7.చల్లారిన తర్వాత నిమ్మరసం పిండడం ద్వారా రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుంది.

తదుపరి వ్యాసం