టొమాటో కేవలం వంటకే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
Unsplash
By Anand Sai Feb 02, 2024
Hindustan Times Telugu
టొమాటోలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.
Unsplash
టొమాటోనూ జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. ఈ జ్యూస్ తాగడం ద్వారా టైఫాయిడ్ కూడా అదుపులో ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
Unsplash
శాస్త్రవేత్తలు టమోటా రసం ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధించారు. ఇది సాల్మొనెల్లా టైఫి, ఇతర హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది.
Unsplash
టొమాటో రసం జీర్ణక్రియ, మూత్ర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
Unsplash
అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో టొమాటో రసం టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియాను చంపగలదని వెల్లడించింది.
Unsplash
ప్రారంభ ప్రయోగాలు ప్రయోగశాలలో సాల్మొనెల్లా టైఫీపై టమోటా రసం బాక్టీరిసైడ్ ప్రభావాన్ని నిర్ధారించాయి.
Unsplash
తరువాత ఈ ప్రక్రియలో యాంటీమైక్రోబయల్ పెప్టైడ్‌లను గుర్తించడానికి పరిశోధనా బృందం టమోటా జన్యువును పరిశీలించింది. సాల్మొనెల్లా టైఫీకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా గుర్తించారు పరిశోధకులు.