తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Warm Places In India । చలి నుంచి తప్పించుకోవాలంటే, ఇండియాలో 5 వెచ్చని ప్రదేశాలు ఇవే!

Warm Places in India । చలి నుంచి తప్పించుకోవాలంటే, ఇండియాలో 5 వెచ్చని ప్రదేశాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

09 January 2023, 11:21 IST

    • Warm Places in India: చలికాలంలో నుంచి తప్పించుకోడానికి ఎటైనా వెచ్చని ప్రదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారా? ఈ జనవరి మాసంలో విహారానికి ఇండియాలోని ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఇక్కడ చూడండి.
Warm Places in India- Goa
Warm Places in India- Goa (Unsplash)

Warm Places in India- Goa

తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది, ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. శీతల పవనాల తాకిడితో నోరు తెరిచినా కూడా నరాలు జివ్వుమంటున్నాయి. ఈ గజగజ వణికించే చలి నుంచి ఏటైనా దూరంగా వెళ్లాలని మీలో చాలా మందికి అనిపిస్తుండొచ్చు. మరి ఎందుకు ఆలస్యం, ఇదే సమయం. జనవరి నెలలో సెలవులు చాలానే వచ్చాయి, మీకు వెచ్చదనాన్ని అందించే ప్రదేశాలు భారతదేశంలో మీకు దగ్గరగా చాలానే ఉన్నాయి. వెంటనే బ్యాగులు సర్దుకొని ఒక నాలుగైదు రోజులు మీకు నచ్చిన వెచ్చని ప్రదేశాలకు అలా విహారయాత్ర చేస్తే, ఎంతో హాయిగా ఉంటుంది. మదిలో ఆనందం ఉంటుంది, కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

మరి ఈ చలికాలంలో భారతదేశంలో వెచ్చగా ఉండే ప్రదేశాలు ఏం ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా? మేము ఇక్కడ మీకు కొన్ని ప్రసిద్ధమైన గమ్యస్థానాల జాబితాను అందిస్తున్నాము. ఈ జనవరి మాసంలో ఈ ప్రదేశాలలో ఎంతో వెచ్చగా, గమ్మత్తుగా ఉంటుంది.

Warm Places in India for Winter Vacation- చలికాలంలో వెచ్చని ప్రదేశాలు

జనవరి, ఫిబ్రవరి మాసాలలో సందర్శించటానికి వెచ్చని, ఉత్తమమైన 5 గమ్యస్థానాలను ఇక్కడ చూడండి.

గోవా

గోవా సందర్శించడానికి ఉత్తమ సమయాలలో జనవరి మాసం ఒకటి. మీ ప్రాంతంలో ఎంతో చలిని తట్టుకొనేందుకు స్వెటర్లు, మఫ్లర్లతో ఒళ్లంతా కప్పేసుకుంటున్న మీరు, గోవా వెళ్తే సౌకర్యవంతమైన టీ షర్టులతో హాయిగా తిరగొచ్చు. బీచ్ లో బికినీలు, మగవారైతే బ్రొకినీలు ధరించి వెచ్చగా ఎండకు కూర్చోవచ్చు, గోవా బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

తమిళనాడు తీరం

తమిళనాడు రాష్ట్రంలోని తీర ప్రాంతాలను ఈ జనవరిలో సందర్శించడానికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు నిండైన సూర్యుడు, బీచ్‌లలో ఇసుక తిన్నెలను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాకుండా తమిళనాడులో ఈ జనవరి మాసంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఎన్నో సాంస్కృతిక పోటీల నిర్వహణ ఉంటుంది. వాటన్నింటిని వీక్షించవచ్చు.

పాండిచ్చేరి

భారతదేశంలో విదేశీయాత్ర చేస్తున్న అనుభూతి పొందాలంటే పాండిచ్చేరి వెళ్లండి. పాండిచ్చేరిని సందర్శించడానికి జనవరి ఉత్తమ సమయం. ఈ ప్రాంతం పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది, నగరంలోని ఫ్రెంచ్ వాస్తుకళతో కూడిన కట్టడాలు, విభిన్న సంస్కృతులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయం.

లక్షద్వీప్

జనవరిలో లక్షద్వీప్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దీని బీచ్‌లు పరిశుభ్రంగా ఉంటాయి. నడి సముద్రంలో ఈ 36 ద్వీపాలు రత్నాళ్లా మెరుస్తాయి. మీరు ఇక్కడ స్నార్కెలింగ్, యాచింగ్, స్కూబా డైవింగ్, కానోయింగ్, బోటింగ్, కయాకింగ్ వంటి వాటర్ అడ్వెంచర్లలో కూడా పాల్గొనవచ్చు.

కోవలం

కేరళ సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, మీరు కోవలం సందర్శించాలి. కోవలం సందర్శించడానికి జనవరి, ఫిబ్రవరి అత్యుత్తమ సమయం. ఈ సమయంలో ఇక్కడ వెచ్చని వాతావరణం ఉంటుంది. కోవలం ఎంతో అందమైన బీచ్‌కు ప్రసిద్ధి చెందింది, మీరు ఇక్కడ వాటర్‌స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు, ఆయుర్వేద స్పా సేవలను పొందవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం