తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Destinations In India : మీకు అడ్వెంచర్స్ ఇష్టమా? అయితే ఈ ప్రాంతాలకు వెళ్లండి..

Best Destinations in India : మీకు అడ్వెంచర్స్ ఇష్టమా? అయితే ఈ ప్రాంతాలకు వెళ్లండి..

29 December 2022, 11:57 IST

    • Best Destinations India : మీ న్యూ ఇయర్​ని అడ్వెంచర్స్​తో ప్రారంభించాలన్నా.. లేదా పాత సంవత్సరాన్ని సాహస క్రీడలతో ముగించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. దీనికోసం మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మన ఇండియాలోనే.. మిమ్మల్ని థ్రిల్ చేసే.. అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. 
అడ్వెంచర్ గేమ్స్
అడ్వెంచర్ గేమ్స్

అడ్వెంచర్ గేమ్స్

Best Destinations India : భారతదేశంలో భౌగోళిక వైవిధ్యం సాహస క్రీడలకు విస్తారమైన శ్రేణిని అందిస్తుంది. నీటి అడుగున అందమైన పగడాలను అన్వేషించడం నుంచి.. పర్వతాల వరకు బైక్‌పై ప్రయాణించడంతో పాటు.. గాలిలో మరింత పైకి పారాగ్లైడింగ్ వరకు ప్రతి అడ్వెంచర్స్ కలిగి ఉంది. అయితే భారతదేశంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కోసం ఐదు అగ్ర గమ్యస్థానాల జాబితా ఇక్కడ ఉంది. అవేంటో మీరు ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

రాక్ క్లైంబింగ్ కోసం

కులు జిల్లాలోని పార్వతి లోయలోని సార్ పాస్ పర్వతారోహకులకు స్వర్గధామం. ఇక్కడి ట్రయల్స్ చాలా అందమైన, ఉత్కంఠభరితమైన వీక్షణలను మీకు అందిస్తాయి. పర్వతాలలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే వేసవికాలంలో రాక్ క్లైంబింగ్‌కు ఉత్తమ సమయంగా చెప్తారు. సార్ పాస్ 14,000 అడుగుల ఎత్తులో ఉంది.

స్కూబా డైవింగ్ కోసం

స్కూబా డైవింగ్ భారతదేశంలో అడ్వెంచర్ కోరుకునేవారిలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. విస్తారమైన భారతీయ తీరప్రాంతంలో అనేక అందమైన పగడాలు, విస్తారమైన సముద్ర జీవులు ఉన్నాయి. మీరు ఈ స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే అండమాన్ దీవులకు చెక్కేయండి.

ఇది మీ అడ్రినలిన్ దాహాన్ని తీర్చడమే కాకుండా.. మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అండమాన్ దీవులు స్కూబా డైవింగ్​కు అద్భుతమైన, అత్యుత్తమమైన అనుభవాన్ని అందిస్తాయి.

పర్వత బైకింగ్ కోసం..

పొడి, రాతి మార్గాలు, చల్లని వాతావరణంతో, లడఖ్ హిమాలయాలలో ఎత్తైన పర్వత-బైకింగ్ గమ్యస్థానాలలో లడఖ్ ఒకటి. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు.. చల్లని గాలి.. కఠినమైన భూభాగంపై సైకిల్ తొక్కడం వంటివి.. మీరు జీవితకాలం ఆదరించే జ్ఞాపకాలను అందిస్తాయి. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ చేయాలనుకునే వారిని ఆకర్షిస్తుంది.

రివర్ రాఫ్టింగ్ కోసం

రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్ ప్రతి సాహస యాత్రికుల మొదటి ఎంపిక. ఇది వ్యసనానికి నాంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో అద్భుతమైన హిమాలయాల మధ్య ఉన్న రిషికేశ్ వైట్‌వాటర్ రివర్ రాఫ్టింగ్‌కు అగ్ర గమ్యస్థానాలలో ఒకటి. మీరు బిగినర్స్ నుంచి ప్రో-లెవల్ వరకు రాపిడ్‌లను అనుభవించవచ్చు. రిషికేశ్‌లో మొత్తం 13 థ్రిల్లింగ్ రివర్ రాపిడ్‌లు ఉన్నాయి.

పారాగ్లైడింగ్ కోసం

అత్యుత్తమ పారాగ్లైడింగ్ గమ్యస్థానాలలో బిర్ బిల్లింగ్ ఒకటి. దానిలో అన్ని భద్రతతో, సులభంగా ప్రయాణించగలగడం గురించి మీ ఫాంటసీని జీవించండి.

హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయాల ధౌలాధర్ శ్రేణులలో ఉన్న బిర్ బిల్లింగ్ భూభాగం మంత్రముగ్దులను చేసే ప్రకృతి దృశ్యాన్ని అందిస్తుంది. ఇది కచ్చితంగా మీ బకెట్ జాబితాను టిక్ ఆఫ్ చేయడానికి ఒక ముఖ్య కార్యాచరణగా చెప్పవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం