తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tongue Burn- Remedies | నోరు కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!

Tongue Burn- Remedies | నోరు కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu

01 September 2022, 19:14 IST

    • బాగా వేడిగా ఉన్నప్పుడు తొందరలో ఏదైనా తిన్నా, తాగినా నోరు కాలుతుంది, నాలుక మండుతుంది. ఇలాంటి సమయాల్లో తక్షణ ఉపశమనం పొందాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..
Burnt Tongue - Remedies
Burnt Tongue - Remedies (iStock)

Burnt Tongue - Remedies

కొన్నిసార్లు హడావిడిగా చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం లేదా టీ, కాఫీ వంటి వేడి పానీయాలు తాగడం చేస్తాం. దీంతో నాలుకకు చురుకు తగులుతుంది. ఆ వేడిని తట్టుకోలేక నోట్లో ఉన్న ఆహారాన్ని మింగలేక, కక్కలేక చేతులు ఆడిస్తూ గుడ్లు పెద్దగా చేసి భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాం. మళ్లీ ఈ కాలిన నాలుకతో ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న స్పైసీ ఫుడ్ తిన్నట్లయితే నోటిలో మంట పెరిగి, కళ్ల నుంచి నీళ్లు రావటం ఖాయం. నాలుక కూడా పగిలినట్లుగా అవుతుంది. నోటిలో చర్మం పొరలు ఊడిపోతాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మరి ఇంతటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడాలంటే అందుకు ఏం చేయాలి అంటే? కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. వేడి పదార్థాలతో మీ నోరు కాల్చుకున్నప్పుడు తక్షణ ఉపశమనం పొందేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. ఇవి పాటించి చూడండి.

ఐస్ క్రీమ్

వేడివేడి ఆహార పదార్థాలు తినడం ద్వారా లేదా చాలా స్పైసీగా ఉన్నవి తిన్నప్పుడు నాలుక మండితే, వెంటనే ఐస్ క్రీమ్ తినేయండి. ఐస్ క్రీమ్ నాలుక వాపును తగ్గిస్తుంది, చల్లని అనుభూతినిస్తుంది. అయితే వెంటనే తినేయకండి. కొంచెం కొంచెంగా నోట్లో వేసుకొని అది కరిగిపోయే వరకు నాలుకపై ఉంచాలి. ఇది మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

తేనె చప్పరించండి

తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంట, చికాకును తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. మీ నోరు కాలినపుడు ఒక చెంచా తేనెను తీసుకొని చప్పరించండి. ఇది నోటికి మృదుత్వాన్ని తీసుకువస్తుంది. నోటిలో అల్సర్లు పోవాలంటే కూడా ఇలా రెండు మూడు సార్లు తేనెను చప్పరిస్తూ ఉండాలి.

చ్యూయింగ్ గమ్

పిప్పరమెంట్ ఫ్లేవర్ చ్యూయింగ్ గమ్ మీ నాలుకను చల్లబరుస్తుంది. మీకు తేలికైన అనుభూతిని ఉంటుంది. ఇది నమలడం వలన నోటిలో లాలాజలం ఊరుతుంది, తద్వారా నోరు తడిగా మారి నొప్పి నుండి ఉపశమనం పొందుతుంది.

పుదీనా నమలండి

పుదీనాలో మంటను చల్లార్చే మెంథాల్ గుణాలు ఉంటాయి. ఇవి మంటగా ఉన్న ప్రాంతాన్ని చల్లబరిచి మంటను తగ్గిస్తాయి. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. మీరు పుదీనా టూత్‌పేస్ట్‌ను కాలిన నాలుకపై పూయవచ్చు. ఇలా చేయడం ద్వారా కూడా మీరు ఉపశమనం పొందుతారు.

పెరుగు

కాలిన నాలుకకు చికిత్స చేయడానికి పెరుగు ఒక ఉత్తమమైన హోం రెమెడీ. ఇది చలువ గుణాలను కలిగి ఉంటుంది. నాలుక మండినపుడు వెంటనే ఒక చెంచా పెరుగు తినండి. ఒక చెంచా పెరుగు తీసుకుని మీ నాలుకపై కొన్ని నిమిషాల పాటు ఉంచి, మెల్లిగా నములుతూ తింటే హాయిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం