తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? డయాబెటిస్ అవ్వొచ్చు

Diabetes Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? డయాబెటిస్ అవ్వొచ్చు

03 September 2022, 17:49 IST

    • Diabetes Symptoms: డయాబెటిస్ అనేది ప్రస్తుతం చాలా మంది పడుతున్న ఇబ్బందుల్లో ఒకటి. దీని లక్షణాలు స్లో పాయిజిన్​లా వస్తాయి. కాబట్టి మీకు ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. 
డయాబెటిస్ లక్షణాలు
డయాబెటిస్ లక్షణాలు

డయాబెటిస్ లక్షణాలు

Diabetes Symptoms: డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు అంత త్వరగా గుర్తించలేము. తెలయకుండానే శరీరం బాధపడటం మొదలుపడుతుంది. మీరు కొన్ని సంకేతాలను గమనిస్తే.. మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందని మీకు తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏవైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మరి ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కీళ్లలో నొప్పి

స్పష్టమైన కారణం లేకుండా వివిధ కండరాలు లేదా కీళ్లలో నొప్పి రావడం మధుమేహంలో ఓ లక్షణం. మీకు ఈ నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదా? అయితే ఇది మధుమేహం వల్ల కూడా వచ్చే అవకాశముంది. మీరు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

గాయం తగ్గకపోతే..

ఏదైనా గాయం తగిలి నొప్పి తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుందా? దీని అర్థం మధుమేహం కావచ్చు. కాబట్టి మీరు ఈ సమస్యను ఎదుర్కొంటే, వెంటనే మీ వైద్యుడికి చెప్పండి.

నిద్రపోయినా అలసటగా ఉందా..

మీరు రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా? ఇది మధుమేహం వల్ల కూడా రావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అలసట పోదు. కాబట్టి మీకు అలాంటి లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించండి.

బరువు తగ్గడం..

మరొక లక్షణం బరువు తగ్గడం. ఇది అందరిలో కనిపించదు కానీ చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మీరు రోజూ ఎలా తింటారో అలా తింటున్నా, అలా తాగుతున్నారో అలాగే తాగుతూ ఉన్నా.. బరువు తగ్గుతున్నారా? అయితే మీరు రక్త పరీక్ష కోసం మీ వైద్యుడిని సంప్రదించాలి.

దాహం, మూత్ర విసర్జన

డయాబెటిస్ లక్షణాల్లో దప్పిక, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కూడా ఒకటి. అలాగే షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆకలి వేస్తుంటుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డయాబెటిస్ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం.

చూపు మందగించడం

డయాబెటిస్ ఉన్న వారికి చూపు మసకబారుతుంది. తీవ్రమైన డయాబెటిస్ ఉంటే కళ్లు దెబ్బతిని గ్లకోమా వంటి సమస్యలు వస్తాయి.

తదుపరి వ్యాసం