Weight Loss Tips । సునాయాసంగా బరువు తగ్గేందుకు సులభమైన చిట్కాలు!-weight loss tips 7 easy ways to burn extra calories and lose weight smoothly
Telugu News  /  Lifestyle  /  Weight Loss Tips 7 Easy Ways To Burn Extra Calories And Lose Weight Smoothly
Weight Loss Tips
Weight Loss Tips (Unsplash)

Weight Loss Tips । సునాయాసంగా బరువు తగ్గేందుకు సులభమైన చిట్కాలు!

23 March 2023, 9:23 ISTHT Telugu Desk
23 March 2023, 9:23 IST

Weight Loss Tips: అధిక బరువు అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. సులభంగా బరువును తగ్గించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి.

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం. శ్రమకోర్చని నిశ్చలమైన జీవనశైలి వలన పొట్ట పెరుగుతుంది, శరీర ఆకారం మారిపోతుంది, ఊబకాయానికి దారితీస్తుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

మీరు అధిక బరువును కలిగి ఉన్నట్లయితే, మీ శరీర బరువును తగ్గించుకోవడం ద్వారా అది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. మీ శరీరం మరింత సమర్థవంతంగా రక్త ప్రసరణ చేస్తుంది.

Weight Loss Tips- బరువు తగ్గేందుకు చిట్కాలు

బరువు తగ్గటం అంత సులభమైన పని కాదు. అందుకు క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటూ ఉండాలి. మీరు రోజూ తినడం ద్వారా వచ్చే కేలరీల కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. ఇందుకోసం మీకు సరైన ప్రణాళిక ఉండాలి. మీరు బరువు తగ్గడంలో సహాయపడే కొన్ని చిట్కాలను తెలుసుకోండి.

అల్పాహారం మానేయకండి

అల్పాహారం మానివేయడం వల్ల మీరు బరువు తగ్గరు. పైగా మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలను కోల్పోవచ్చు. పెరిగిన ఆకలి కారణంగా మిగతా రోజంతా ఎక్కువ ఆహారం తీసుకోవచ్చు. కాబట్టి ఉదయం తప్పనిసరిగా పోషకాలు నిండిన అల్పాహారం చేయాలి. ప్రోటీన్లు ఎక్కువ ఉండే అల్పాహారం చేయడం వలన బరువు తగ్గవచ్చు.

మరింత చురుకుగా ఉండండి

ప్రతిరోజూ చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ శరీరంలోని అదనపు కేలరీలను ఖర్చు చేయవచ్చు. తద్వారా కొవ్వు పెరగదు, కండరాలు బలోపేతం అవుతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వారంలో మూడు, నాలుగు రోజులైనా కనీసం 30 నిమిషాల మితమైన-తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని చేయండి.

సమతుల్య ఆహారం తీసుకోండి

ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోండి. అదే సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి.

వేళకు భోజనం చేయండి

సమతుల్య ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యమే. రోజులో రెగ్యులర్ సమయాల్లో తినడం వల్ల కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. ఇది కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న చిరుతిండికి టెంప్టేషన్‌ను కూడా తగ్గిస్తుంది.

నీరు పుష్కలంగా త్రాగాలి

పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని పొందవచ్చు, ఇది మీ ఆకలిని తగ్గింస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.

ఒత్తిడిని నియంత్రించండి

అతిగా తినడానికి, బరువు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. ఇవి మీకు ఒత్తిడిని తగ్గించగలవు.

మద్యం తగ్గించండి

ఒక గ్లాస్ వైన్ తాగడం వలన ఒక పెద్ద చాక్లెట్ తినడం కంటే ఎక్కువ కేలరీలు పెరుగుతాయి. మద్యపానం అతిగా తినడానికి ప్రేరేపిస్తుంది. కాలక్రమేణా, ఈ అలవాటు సులభంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

సంబంధిత కథనం