తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eat With Peel । తొక్కే కదా అని తీసేస్తే.. పోషకాలు పోతాయి!

Eat With Peel । తొక్కే కదా అని తీసేస్తే.. పోషకాలు పోతాయి!

HT Telugu Desk HT Telugu

13 November 2022, 10:45 IST

    • Eat With Peel: అన్ని కూరగాయలు, పండ్ల తొక్కలను తీసి పారేయకండి, ఆ తొక్కలోనే ఉన్నాయి పోషకాలన్నీ. ఏ తొక్కలో ఏముందో ఇక్కడ తెలుకోండి.
Eat With Peel
Eat With Peel (Unsplash)

Eat With Peel

ఆరోగ్యం కోసం తాజా పండ్లను, కూరగాయలను తినాలని మనకు తెలిసిందే. అయితే సరైన విధానంలో తినడం కూడా ముఖ్యమే. కానీ, చాలా మందికి ఏది సరైన విధానం అనేది తెలియదు. కొన్నింటికి పండు తిని తొక్క పారేయాలి, మరికొన్నింటికి తొక్కతో కలిపి తినాలి. అప్పుడే అందాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

చాలా మంది తినేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు కొన్ని పండ్లు, కూరగాయలను పొట్టు తీసేస్తారు. కానీ మనం తీసేసి పారేసే ఈ పీల్స్ లోనే చాలా పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లలో కంటే తొక్కలోనే 25-30 శాతం పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. కూరగాయలలో 31 శాతం పీచు తొక్కలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పట్నించి ఏదైనా తినేటపుడు తొక్కే కదా అని తీసి పారేయకుండా, తొక్కతో కలిపి తినండి. ఆ జాబితాలో ఏమేం ఉన్నాయో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

ఆరెంజ్

నారింజలో విటమిన్ సి ఉంటుంది. కానీ ఇక్కడ పండులో కంటే తొక్కలో విటమిన్ సి రెండింతలు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు నారింజ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. కానీ ఆరెంజ్ తొక్క తింటే అది సులభంగా జీర్ణం కాదు. కాబట్టి తొక్కను తురముకోవాలి. నారింజ తురుమును కొద్దికొద్దిగా సలాడ్లు, ఆహార పదార్థాలు, పానీయాలలో పై నుంని గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే ఎండబెట్టి వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా పండులోని పోషకాలు పూర్తిగా పొందవచ్చు.

పుచ్చకాయ

చాలా మంది పుచ్చకాయ గుజ్జు మాత్రమే తిని తొక్కను పారేస్తారు. కానీ దీని తొక్కలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తం నుండి నత్రజనిని తొలగించడంలో సహాయపడుతుంది. గుజ్జులో కంటే పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కను వేయించి కూరగాయగా తినవచ్చు. మీకు కావాలంటే, మీరు దాని నుండి ఊరగాయను తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ తొక్కతో హల్వా కూడా చేస్తారు. స్టార్ హోటెళ్లలో చెఫ్‌లు ఈ తొక్కలతోనే ఎన్నో వెరైటీలు చేస్తారు.

ఆపిల్

కొంతమంది ఆపిల్‌ను కూడా పొట్టు తీసి తింటారు. ఆపిల్‌ను దాని చర్మంతో కలిపి తినడం వల్ల విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఆపిల్‌ను వాటి తొక్కలతో కలిపి తినడం వల్ల మెదడు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

దోసకాయ

దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది దీని పొట్టు గీకేసి తింటారు. కానీ దీనిని పొట్టుతో కలిపి తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ తొక్కలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్తం గడ్డకట్టడంలో అవసరం అవుతుందు. దోసకాయ తొక్క చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ కలిగి ఉంటుంది.

బంగాళదుంప

ఆలుగడ్డలలో లోపల ఉండే దుంప కంటే, పైన ఉండే చర్మంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. చర్మం తొలగించి వండిన బంగాళదుంపల కంటే చర్మంతో కలిపి వండిన బంగాళదుంపలు తింటే విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఎక్కువ మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి.. బంగాళదుంప తొక్కలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్ సంపూర్ణత్వం అనుభూతిని అందిస్తుంది , ఆకలిని అదుపులో ఉంచుతుంది.

మామిడి పండు

మామిడి తొక్కలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ , కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి తొక్కలు పారేసే ముందు ఆలోచించండి.

టాపిక్

తదుపరి వ్యాసం