తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Magnesium Deficiency: తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఈ పోషకం లోపించినట్టే

Magnesium Deficiency: తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఈ పోషకం లోపించినట్టే

Haritha Chappa HT Telugu

14 April 2024, 17:00 IST

    • Magnesium Deficiency: మన శరీరానికి కావలసిన పోషకాలలో కొన్ని లోపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల లక్షణాలను శరీరం చూపిస్తుంది. మెగ్నీషియం లోపం ఉంటే వికారం, వాంతులు వంటి లక్షణాలు చూపించే అవకాశం ఉంది.
మెగ్నీషియం ఉన్న ఆహారాలు
మెగ్నీషియం ఉన్న ఆహారాలు (Pixabay)

మెగ్నీషియం ఉన్న ఆహారాలు

Magnesium Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు అవసరం పడతాయి. ఈ విటమిన్లు, ఖనిజాలను కలిపే పోషకాలు అంటాము. ఈ పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. మెగ్నీషియం మన శరీరానికి చాలా అవసరం. ఎవరి శరీరంలో అయితే మెగ్నీషియం లోపిస్తుందో వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తరచూ వాంతులు వచ్చినట్టు అనిపించడం, వికారంగా అనిపించడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు మెగ్నీషియం ఉన్న ఆహారాలను తినాలని అర్థం చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

మెగ్నీషియం మన శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎంతో అవసరం. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నరాలను కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మెగ్నీషియం ఎంతో అవసరం. అలాగే కాల్షియం స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా ఇది అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలో రక్తపోటును నియంత్రించడానికి మెగ్నీషియం అవసరం పడుతుంది. కాబట్టి మెగ్నీషియం లోపం ఉంటే అందుకు తగిన ఆహారాలను తీసుకోవాలి.

మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు

మెగ్నీషియం లోపించిన వారిలో తరచూ చిన్న చిన్న దుర్వాసనలకే వాంతులు, వికారం వంటివి వస్తాయి. నరాల పనితీరు సరిగ్గా ఉండదు. నరాలలో సూదులు గుచ్చినట్టు ఉంటుంది. నరాలు పట్టేసినట్టు, తిమ్మిరి పట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇవన్నీ మెగ్నీషియం లోపాన్ని సూచించే లక్షణాలు. మెగ్నీషియం లోపిస్తే గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. గుండె దడ వంటివి వస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. వణుకులాంటివి వస్తాయి. ఆకలి వేయదు. రక్తనాళాలు సంకోచిస్తుంది. అప్పుడప్పుడు తలనొప్పి, మైగ్రేన్ వంటివి వస్తాయి. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతున్నా మెగ్నీషియం ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. మెగ్నీషియం లోపిస్తే నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి పైన చెప్పిన ఎలాంటి లక్షణాలు కనిపించినా ఆహారాన్ని అధికంగా తీసుకోవడం అత్యవసరం.

మెగ్నీషియం ఉన్న ఆహారాలు

మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలలో సోయాతో చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే టోఫు, బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, కొమ్ము శనగలు, పాలకూర, కొబ్బరి పాలు, చియా సీడ్స్, చింతపండు, మాకరల్ వంటి చేపలు, గుమ్మడి గింజలు, అవకాడో పండ్లు, బెండకాయలు, బ్లాక్ బీన్స్ ఇవన్నీ తినడం వల్ల మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం