తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plastic Can Problems : ఇది సీరియస్ మ్యాటర్.. ప్లాస్టిక్ క్యాన్‍లో నీరు తాగితే ఇన్ని సమస్యలా?

Plastic Can Problems : ఇది సీరియస్ మ్యాటర్.. ప్లాస్టిక్ క్యాన్‍లో నీరు తాగితే ఇన్ని సమస్యలా?

Anand Sai HT Telugu

27 October 2023, 12:30 IST

    • Plastic Water Bottle Health Problems : ప్లాస్టిక్ క్యాన్ ఉపయోగించడం అనేది వందలో 99 మంది చేస్తారు. తెచ్చేందుకు ఈజీ, మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి. కానీ ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉపయోగిస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
ప్లాస్టిక్ వాటర్ క్యాన్
ప్లాస్టిక్ వాటర్ క్యాన్

ప్లాస్టిక్ వాటర్ క్యాన్

ఈ కాలంలో 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌(Plastic Water Can) అనేది ప్రతీ ఇంట్లో ప్రాథమిక అవసరం అయిపోయింది. ఎందుకంటే.. ఇందులో నీటిని తెచ్చుకోవచ్చు, దానిలో పెట్టుకునే నీటిని తాగొచ్చు. ఇది ముఖ్యమైన అవసరంగా మారింది. చాలా మంది రోజూ నీటి కోసం ప్లాస్టిక్ వాటర్ క్యాన్లపైనే ఆధారపడే పరిస్థితి ఉంది. కానీ వాటర్ క్యాన్లలోని నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాదు, అవి పర్యావరణానికి కూడా చాలా విషపూరితమైనవి. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

ప్లాస్టిక్‍ను పారవేయడం వల్ల భూ, జల పర్యావరణం కలుషితమవుతుంది. వన్యప్రాణులు, సహజ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి అనేది వాతావరణంలో మార్పును తీసుకొస్తుంది. ఒక్క ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలిసిపోయేందుకు చాలా ఏళ్ల సమయం పడుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో చాల ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి ప్లాస్టిక్‍ వాటర్ క్యాన్‍లో నీరు తాగితే కూడా అనేక సమస్యలు.

మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు ప్లాస్టిక్‌ల నుండి వచ్చే రసాయనాలు కాలక్రమేణా నీటిలోకి వెళ్లి మీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ వాటర్ క్యాన్‌లు ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది. నీటి క్యాన్లను బహిరంగ వాహనాల్లో రవాణా చేయడం లేదా నేరుగా సూర్యకాంతిలో దుకాణాల్లో నిల్వ చేయడం మనందరం చూస్తుంటాం. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లను ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు(Plastic Water Cans Problems) తలెత్తుతాయి. ఆందోళన, జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత,క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి పరిస్థితులు వస్తాయి.

రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌ల నీరు తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ(Immunity System)కు అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్‌లోని రసాయనాలు శరీరం రోగనిరోధక చర్యలకు అంతరాయం కలిగిస్తాయి.

డయాక్సిన్ ఉత్పత్తి

సూర్యరశ్మికి ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఉండటం వలన డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది. ఇది తీసుకుంటే రొమ్ము క్యాన్సర్(Breast Cancer) ప్రమాదాన్ని పెంచుతుంది.

కాలేయ క్యాన్సర్, తక్కువ స్పెర్మ్ కౌంట్

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో థాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. వాటి నుండి నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్, తక్కువ స్పెర్మ్ కౌంట్(Sperm Count) వస్తుంది. మీ రక్తప్రవాహంలోకి ప్రవేశించగల BPA వంటి పదార్థాలు మీ కణాలకు హాని కలిగించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

BPA

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఈస్ట్రోజెన్‌ను అనుకరించే బిస్ఫినాల్ A (BPA) అనే రసాయనాన్ని నిర్మించగలవు. ఇది మధుమేహం, స్థూలకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికలలో అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అందుకే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం మానుకోవాలి.

ప్లాస్టిక్‌ను నిర్మూలించడం సవాలుతో కూడుకున్నది. అయినా ప్లాస్టిక్‌కు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజువారీ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. చాలా మంది ఇప్పటికే గుడ్డ సంచులు, మెటల్ వాటర్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. మీరు కూడా దయచేసి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి..

తదుపరి వ్యాసం