తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Turmeric Around Eyes : ఆరోగ్యానికి పసుపు చేసే మహిమలు.. 10 నిమిషాలు కళ్ల చుట్టూ రాస్తే చాలు!

Turmeric Around Eyes : ఆరోగ్యానికి పసుపు చేసే మహిమలు.. 10 నిమిషాలు కళ్ల చుట్టూ రాస్తే చాలు!

Anand Sai HT Telugu

24 February 2024, 5:30 IST

    • Turmeric Around Eyes Benefits : పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. అయితే దీనిని తీసుకునే విధానంతో వివిధ రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజూ కళ్ల చుట్టూ పసుపు ముద్దను రాస్తే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
కళ్ల చుట్టూ పసుపు రాసుకుంటే ప్రయోజనాలు
కళ్ల చుట్టూ పసుపు రాసుకుంటే ప్రయోజనాలు (Unsplash)

కళ్ల చుట్టూ పసుపు రాసుకుంటే ప్రయోజనాలు

మన వంటగదిలో ఉండే అద్భుతమైన ఔషధ పదార్థాలలో పసుపు ఒకటి. ఈ పసుపును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. పురాతన కాలం నుండి సౌందర్య సంరక్షణ ఉత్పత్తిగా పసుపును వాడుతారు. పసుపును ఆహారంలో చేర్చడమే కాకుండా కళ్ల చుట్టూ అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పసుపు ముద్దను కళ్ల చుట్టూ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, పసుపు పేస్ట్‌ను ఎలా తయారు చేసి ఉపయోగించాలో తెలుసుకుందాం..

పసుపుతో ఏం చేయాలి?

అవసరమైన పదార్థాలు : పసుపు పొడి, కొద్దిగా పైనాపిల్ రసం

పైనాపిల్ రసంతో పసుపు పొడిని పేస్ట్ చేసి కళ్ల చుట్టూ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు మాయమై రక్త ప్రసరణ పెరిగి కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

శరీరంలోని వివిధ సమస్యలను నివారించడానికి పసుపును మరో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. దానిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం..

అవసరమైన పదార్థాలు : పాలు - 1 కప్పు, పసుపు పొడి - 1/2 స్పూన్, మిరియాల పొడి - 1/4 స్పూన్, తేనె - 1 చెంచా, కొబ్బరి నూనె - 1/2 టేబుల్ స్పూన్, యాలకుల పొడి - 1, దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క

ముందుగా పాలను వేడి చేసి యాలకులు, బెరడు వేయాలి. తర్వాత పసుపు పొడి, మిరియాల పొడి, కొబ్బరి నూనె, తేనె వేసి నిరంతరం కదిలించాలి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి కళ్ల పైభాగంలో, కింది భాగంలో రాసి 5-8 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి, తర్వాత కడిగేయాలి.

ఇలా చేస్తే.. తలనొప్పి, విరేచనాలు, జలుబు, కడుపులో నులిపురుగుల సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. వాపు వల్ల కలిగే కీళ్ల, కండరాల నొప్పిని తగ్గించే శక్తి దీనికి కలిగి ఉంటుంది.

పసుపు ప్రయోజనాలు

పసుపుకు ప్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి, శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచే సామర్థ్యం ఉందని తెలిసిందే. ఇది క్యాన్సర్ ఏర్పడటానికి సంబంధించిన ఎంజైమ్‌లను కూడా నిరోధిస్తుంది. పసుపు మెదడు ఆరోగ్యం, పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మెదడులో అమిలాయిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది, అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది.

పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, వాటిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. పసుపు పిత్త ఉత్పత్తిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అపానవాయువును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును పసుపు మెరుగుపరుస్తుంది. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే పసుపుతో చర్మానికి అలెర్జీలాంటిది ఉంటే.. వైద్యుడిని సంప్రదించండి.

పసుపు పురాతన కాలం నుంచి ఔషధాల్లో ఉపయోగిస్తారు. శరీరానికి పసుపు చేసే మేలు చాలా ఉంటుంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సమర్థవంతంగా పని చేస్తుంది. ఒకవేళ మీ చర్మానికి పసుపు పడకపోతే.. వాడకపోవడం మంచిది.

తదుపరి వ్యాసం