7 grand Ram Temples across India: అంతగా పాపులర్ కాని భారత్ లోని ఏడు పురాతన రామాలయాలు-amid ayodhya ram mandir fete here are 7 grand ram temples across india to visit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  7 Grand Ram Temples Across India: అంతగా పాపులర్ కాని భారత్ లోని ఏడు పురాతన రామాలయాలు

7 grand Ram Temples across India: అంతగా పాపులర్ కాని భారత్ లోని ఏడు పురాతన రామాలయాలు

HT Telugu Desk HT Telugu
Jan 17, 2024 10:37 AM IST

7 grand Ram Temples across India: మరో 5 రోజుల్లో అయోధ్యలో పునర్నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. భారత దేశ వ్యాప్తంగా పురాతన రామాలయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన 7 శ్రీరాముడి ఆలయాల గురించి తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

7 grand Ram Temples across India: వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, కంబ రామాయణం, తుసిదాస్ రామచరిత మానస్ - ఇలా భారతీయ ఇతిహాస కావ్యమైన రామాయణం మూడు వందల వెర్షన్లు ఉనికిలో ఉన్నాయి. కథా కథనం ఎలా ఉన్నా.. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22 న అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ayodhya ram mandir)లో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు.

అయోధ్యలో..

అయోధ్య (Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందని ఏడు రామాలయాల వివరాలు ఇక్కడ ఉంది. వాటిలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంటిమిట్ట రామాలయం కూడా ఉంది.

కోదండరామ ఆలయం - ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్

కోదండరామ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వొంటిమిట్ట మండలం, వొంటిమిట్ట పట్టణంలో ఉంది. పూర్వ నిషాద వంశానికి చెందిన దొంగలు వొంతుడు, మిట్టుడు రామ భక్తులుా మారి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.

ఎరి-కథా రామర్ ఆలయం- మధురాంతకం, తమిళనాడు

తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఎరి-కథా రామర్ ఆలయం రామాయణ కథనంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. లంకలో రావణాసురుడిని వధించిన తరువాత, శ్రీరాముడు, సీతా లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో మధురాంతకంలో కొద్ది సేపు ఆగారని భక్తులు విశ్వసిస్తారు.

రామ్ తీర్థ్ ఆలయం- అమృత్ సర్, పంజాబ్

పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న రామ్ తీరథ్ ఆలయం రాముడు, సీత కుమారులైన లవ, కుశుల జననానికి సంబంధించినది. ఈ ఆలయం దాని పురాతన బావికి ప్రసిద్ధి చెందింది. ఆ బావిలోని నీటిలో ఔషధ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం కూడా ఇదేనని విశ్వసిస్తారు.

త్రి స్రయార్ శ్రీ రామాలయం- కేరళ

కేరళలోని త్రిస్సూర్ జిల్లా, త్రి ప్రయార్ లో ఉన్న త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయంలో కృష్ణుడు ఆరాధించిన శ్రీరాముడి విగ్రహం ఉంది. దశరథ మహారాజు నలుగురు కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఉన్న నాలుగు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిది.

కోదండ రామాలయం- చిక్ మగళూరు, కర్నాటక

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా హీరేమగళూరులో కొలువై ఉన్న కోదండరామస్వామి ఆలయం స్కంద పురాణం లో ఉన్న ఒక విశిష్ట సంఘటనతో ముడిపడి ఉంది. స్కంద పురాణం ప్రకారం, శ్రీరాముడు సీతామాతను వివాహం చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనం ఇస్తాడు.

రామ్ రాజా టెంపుల్ - ఓర్చా, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లోని ఓర్చాలో ఉన్న రామ్ రాజా టెంపుల్, రాజ ప్రసాదం సెట్టింగ్ లో రాముడిని రాజుగా ఆరాధించే ఏకైక ఆలయంగా ప్రత్యేకమైనది. ఇక్కడ శ్రీరాముడు మహారాజుగా దర్శనమిస్తాడు. మహారాజులకు ప్రతీ రోజు ఇచ్చే గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఖడ్గం, కవచం పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది.

శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం- తిరుప్పుకుళి, కాంచీపురం జిల్లా, తమిళనాడు

తమిళనాడు, కాంచీపురం జిల్లా, తిరుప్పుకుళిలో ఉన్న ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఒకటి. గర్భగుడి లోపల, విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువును చిత్రీకరించారు. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు తనకు సీతాదేవి వివరాలను చెప్పిన జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసినట్లుగా భక్తులు విశ్వసిస్తారు.

Whats_app_banner