Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం- జనవరి 22 వరకు పూర్తి షెడ్యూల్​ ఇదే..-ayodhya ram mandirs pran pratistha ceremony rituals begins see full schedule ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం- జనవరి 22 వరకు పూర్తి షెడ్యూల్​ ఇదే..

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం- జనవరి 22 వరకు పూర్తి షెడ్యూల్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Jan 16, 2024 11:10 AM IST

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరంలో సంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 22న ఆలయ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది.

అయోధ్య రామ మందిరం- జనవరి 22 వరకు పూర్తి షెడ్యూల్​ ఇదే..
అయోధ్య రామ మందిరం- జనవరి 22 వరకు పూర్తి షెడ్యూల్​ ఇదే.. (ANI Picture Service)

Ayodhya Ram Mandir latest updates : రామ మందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్యలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేలకుపైగా మంది అతిథులు వస్తారని అంచనా! కాగా.. నేటి నుంచి ఆ ప్రాంతంలో సంప్రదాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 22 వరకు జరగనున్న వివిధ కార్యక్రమాల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రామ మందిర ప్రారంభోత్సవం- షెడ్యూల్​..

జనవరి 16:- అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలు 16వ తేదీన మొదలయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నియమించిన వారు ఈ కార్యక్రమాలను చూసుకుంటారు. సరయూ నది తీరాన.. విష్ణు ప్రార్థన, దసవిద్​ స్నానం, గో ధానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.

జనవరి 17:- రామ్​ లల్లా విగ్రహంతో కూడిన ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంద. సరయూ నది నీరు ఉన్న మంగళ కలశం.. శ్రీ రామ జన్మభూమికి చేరుకుంటుంది.

Ayodhya Ram Mandir : జనవరి 18:- గణపతి అంబిక పూజ, వరుణ్​ పూజ, మాత్రిక పూజ, బ్రాహ్మిణ్​ వరణ్​, వాస్తు పూజలు జరుగుతాయి. వీటితో సంప్రదాయ కార్యక్రమాలు అధికారికంగా మొదలవుతాయి.

జనవరి 19:- అగ్ని దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. నవగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది.

జనవరి 20:- రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి చేస్తారు. అన్నదివాస్​ చేపడతారు.

జనవరి 21:- 125 పవిత్ర కలశాలతో రామ్​ లల్లా విగ్రహానికి స్నానం చేయిస్తారు.

Ayodhya Ram Mandir Pran Pratistha : జనవరి 22:- అయోధ్యలో చారిత్రక ఘట్టం. రామ మందిర ప్రారంభోత్సవం. 150 దేశాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. రామ్​ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.

జనవరి 21-22 తేదీల్లో సాధారణ ప్రజలకు ఆలయంలోకి అనుమతి ఉండదు. 23 నుంచి అందరు రాముడిని దర్శించుకోవచ్చు.

రామ మందిరానికి ఎంత ఖర్చు అయ్యింది?

Ayodhya Ram Mandir cost : రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర.. దేశ, విదేశాల నుంచి సేకరించిన నిధులే. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చారు. అయోధ్యలో 2020లో రామ మందిరానికి శుంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత.. నిధుల కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. 2021లో 44 రోజుల పాటు విరాళాల సేకరణ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో.. విరాళాల రూపంలో రూ. 2,100 కోట్లను సేకరించినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సభ్యులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం