తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pilot Career : విమానయాన రంగంలో బెస్ట్ కెరీర్.. పైలెట్‌గా లక్షలు సంపాదించొచ్చు

Pilot Career : విమానయాన రంగంలో బెస్ట్ కెరీర్.. పైలెట్‌గా లక్షలు సంపాదించొచ్చు

Anand Sai HT Telugu

11 March 2024, 13:15 IST

    • Pilot Jobs : చాలా మందికి కొన్ని రకాల ఉద్యోగాల గురించి పెద్దగా తెలియదు. వాటిని పట్టించుకోరు కూడా. అందులో ఒకటి విమానయాన రంగంలో పైలెట్ జాబ్. 12వ తరగతి చదివితే చాలు.. ఈ ఉద్యోగం కోసం ట్రై చేయవచ్చు.
పైలెట్ ఉద్యోగాలు
పైలెట్ ఉద్యోగాలు (Unsplash)

పైలెట్ ఉద్యోగాలు

టెక్నాలజీ పెరిగింది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. యువత సైతం కొత్త దారుల్లో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అందులో ఒకటి విమానయాన రంగంలో ఉద్యోగం చేయడం. కొందరికి ఇది కలగా ఉంటుంది. కానీ వెళ్లే దారి తెలియక ఇబ్బందులు పడతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ ఫీల్డ్‌లో కెరీర్‌ని నిర్మించుకోవాలనుకుంటారు. నేటి యువతకు ఎన్నో మంచి కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. పైలట్ అయిన తర్వాత మీరు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

మీరు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక ఏదైనా మెరుగ్గా చేయాలనుకుంటే పైలెట్ అవ్వడం మంచి ఆప్షన్. జీవితంలో ఏ దిశలో వెళ్లాలనే విషయంలో గందరగోళంగా ఉంటే ఈ అంశం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పైలట్‌గా ఉండి విజయాల ఆకాశాన్ని చేరుకోవచ్చు. సమాచారం లేకపోవడంతో కొంతమంది ఈ రంగంలో వృత్తిని కొనసాగించాలని అనుకోరు. అయితే నేటి యువతకు ఎన్నో మంచి కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. పైలట్ అయిన తర్వాత మీరు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

12వ తరగతి చదివితే చాలు

అనుకున్న సమయానికి ఈ రంగంలో కెరీర్‌ని చక్కదిద్దుకోవాలని ఆలోచిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో కెరీర్ నిర్మించుకునేందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఏదైనా ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందాలంటే ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావాలి. ఈ రౌండ్‌లన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత మీరు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందుతారు. ఇక్కడ మీకు విమానంతో సంబంధం ఉన్న పాఠాలను బొధిస్తారు. ఎగరడానికి పూర్తి శిక్షణ ఇస్తారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్

మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావాలనుకుంటే 12వ తరగతి తర్వాత UPSC NDA పరీక్ష, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT), NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ పరీక్షలను క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పొందుతారు. అదే సమయంలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా ఉద్యోగం పొందడానికి మీరు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను కూడా తీసుకోవచ్చు.

కమర్షియల్ పైలెట్

12వ తరగతి తర్వాత ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ నుండి శిక్షణతో కమర్షియల్ పైలట్ కూడా కావచ్చు. శిక్షణ పూర్తయిన తర్వాత మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కోసం ఫిట్‌నెస్ పరీక్ష, రాత పరీక్ష రాయాలి. ఆ తర్వాత ఉత్తిర్ణులు అయిన అభ్యర్థులు తమ వృత్తిని కమర్షియల్ పైలట్‌గా ప్రారంభించవచ్చు.

పైలెట్ జీతం

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ జీతం రూ. 56,100 నుండి ప్రారంభమవుతుంది. అయితే కమర్షియల్ పైలట్‌గా మీరు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. అనుభవంతో ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఏది చేయాలనుకున్న ముందే ఒక ప్రణాళిక వేసుకోండి. వయసు అయిపోయాక చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. కల.. కలగానే మిగిలిపోతుంది.

తదుపరి వ్యాసం