తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Meditation Day: 5 మినట్స్ మెడిటేషన్ టెక్నిక్స్.. కూర్చుని, నిల్చుని, పడుకుని కూడా చేసేయొచ్చు..

World Meditation Day: 5 మినట్స్ మెడిటేషన్ టెక్నిక్స్.. కూర్చుని, నిల్చుని, పడుకుని కూడా చేసేయొచ్చు..

21 May 2023, 9:07 IST

  • World Meditation Day: ధ్యానం చేయడం వల్ల లాభాలు బోలెడు. దాని ప్రాముఖ్యతను తెలియజేసేదే వరల్డ్ మెడిటేషన్ డే. అయిదు నిమిషాల్లో మనసును ప్రశాంతంగా చేయగల ధ్యాన మర్గాలేంటో చూడండి. 

వరల్డ్ మెడిటేషన్ డే
వరల్డ్ మెడిటేషన్ డే (Pexels)

వరల్డ్ మెడిటేషన్ డే

గడియారం కన్నా వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో కాస్త సమయం తీసుకుని మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఈ 5 నిమిషాల మెడిటేషన్ టెక్నిక్ వల్ల ప్రశాంతత, ఏకాంతం దొరుకుతాయి. మీరు మీ ఆఫీసుకు బస్సులో వెళ్తున్నపుడో, ఖాళీగా కాస్త సమయం దొరికినపుడు, ఎటైనా నడుస్తున్నపుడు వీటిని అభ్యసించడం మొదలుపెట్టండి.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

వరల్డ్ మెడిటేషన్ డే ఏటా మే 21 న జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేయడం గురించి అవగాహన, ప్రాముఖ్యత తెలియజేయడమే దీని ఉద్దేశం. బిజీ జీవితాల్లో మనకు ప్రశాంతత ఇచ్చే కాస్త సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఆ అనుభూతి కలుగుతుంది. ధ్యానం అంటే గంటలకొద్దీ చేయాలని చాలా మంది దాన్ని పట్టించుకోరు. కానీ కేవలం అయిదు నిమిషాలు కేటాయించగలిగినా కూడా మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

5 మినట్ మెడిటేషన్ టెక్నిక్స్:

1. శ్వాస మీద ద్యాస:

చుట్టూ ఎంత చప్పుడున్నా.. మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. కళ్లు మూసుకుని మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్వాస నిశ్వాస క్రియలను గమనించండి. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని నియంత్రించడానికి ప్రయత్నించడం కన్నా మీకు ఆనందాన్నిచ్చే విషయాల గురించి ఆలోచిస్తూ మెల్లగా ఆలోచన మార్చుకోండి. మళ్లీ శ్వాస మీద ద్యాస పెట్టండి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, విశ్రాంతి తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది.

2. బాడీ స్కాన్ మెడిటేషన్:

మన దృష్టిని శరీరంలోని వివిధ భాగాల మీదకి మళ్లిస్తూ చేయడమే ఈ టెక్నిక్. ఒక దగ్గర కూర్చోండి, వీలైతే కింద పడుకోండి. కళ్లు మూసుకోండి. మీ దృష్టి ముందుగా మీ కాలి బొటన వేళ్ల మీదకు తీసుకురండి. మెల్లమెల్లగా ప్రతి భాగం గురించి ఆలోచిస్తూ పై వరకూ రండి. ఎక్కడైనా మీకు ఒత్తిడిగా అనిపిస్తుందేమో గమనించండి. ఇదంతా శ్వాస పీల్చుతూ , వదులుతూ చేయాలి. మీ శరీరానికి మీకూ ఉన్న బంధాన్ని ఇది పెంచుతుంది. ప్రశాంతత ఇస్తుంది.

3. ప్రేమ-సానుభూతి మెడిటేషన్:

ఇది మీలోని ప్రేమను, దయా హృదయాన్ని, మంచితనాన్ని పెంచడంలో సాయపడుతుంది. హాయిగా కూర్చుని, కళ్లు మూస్కోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్లని, మీరు ఇష్టపడే వాళ్లని గుర్తు తెచ్చుకోండి. వాళ్లు మీ పక్కనే కూర్చున్నట్లుగా అనుభూతిని ఫీల్ అవ్వండి. మీ ప్రేమను వాళ్లకి మీ మనసులోనే తెలియజేయండి. ఈ అభ్యాసం వల్ల సానుభూతి, కృతజ్ఞతా భావం పెరుగుతుంది.

4. 100 శ్వాసల ధ్యానం

ఇది మొదటి ప్రక్రియ లాంటిదే. శ్వాస మీద ద్యాస పెట్టాలి. అయిదు నిమిషాల్లో చేయదగ్గ గొప్ప ప్రక్రియ ఇది. కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. శ్వాస తీసుకుంటూ ఒకటి నుంచి వంద అంకెలు లెక్కబెట్టాలి. అంటే శ్వాస తీసుకుని వదలగానే ఒకటి, ఇంకోసరి శ్వాస తీసుకుని వదలగానే రెండు.. ఇలా లెక్కించుకుంటూ వంద వరకూ చేయాలి. దీనివల్ల శ్వాస మీద మాత్రమే ద్యాస ఉంటుంది.

5. నడక మీద దృష్టి:

మీకు ఒక చోట కూర్చుని చేసే సమయం లేకపోతే నడుస్తున్నపుడు చేయదగ్గ మెడిటేషన్ ఇది. మీరెప్పుడూ ఎలా నడుస్తారో అలాగే నడవటం మొదలుపెట్టండి. మీ పాదాల కదలిక, అడుగు పడుతున్న తీరు , వేగం, నడక తీరు గమనించండి. ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా వీటి మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి. ఎప్పుడైనా కాస్త దూరం నడవబోతున్నారంటే ఫోన్ మాట్లాడటానికి బదులు ఇలా చేయండి. దీనివల్ల శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం