Language of Love: మీ ప్రేమను వ్యక్తీకరించాలా? అయితే ఇదిగో ప్రేమ భాష!
- Language of Love: ప్రేమను వ్యక్తీకరించడానికి కూడా ఒక భాష ఉంటే బాగుండేదేమోనని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఈ ప్రేమ సంభాషణలు కొనసాగించడానికి ఈ ప్రేమ భాషలు సరిపోతాయేమో చూడండి..
- Language of Love: ప్రేమను వ్యక్తీకరించడానికి కూడా ఒక భాష ఉంటే బాగుండేదేమోనని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఈ ప్రేమ సంభాషణలు కొనసాగించడానికి ఈ ప్రేమ భాషలు సరిపోతాయేమో చూడండి..
(1 / 6)
ఎదుటివారికి మీ ప్రేమను తెలియజెప్పాలంటే కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు. అయితే ఇష్టం ఉన్నచోట కష్టం అనేదే ఉండదు అని థెరపిస్టులు సూచిస్తున్నారు. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మీ ప్రేమను వ్యక్తీకరించడానికి 'ఐ లవ్ యూ' అని చెప్పాల్సిన అవసరం లేదు. థెరపిస్ట్ ఎలిజబెత్ ఫెడ్రిక్ సూచించిన ఐదు ప్రేమలు ఇక్కడ నేర్చుకోండి.
(2 / 6)
ఒకరిపై ఒకరికి శ్రద్ధ: ఎల్లప్పుడూ మీ భాగస్వామి మంచిచెడుల గురించి ఆలోచించడం. ఒకరిపైఒకరు శ్రద్ధ తీసుకోవడం, కష్టసుఖాలను కలిసి పంచుకోవడం కూడా ప్రేమకు ఒక భాషనే!
(Unsplash)(3 / 6)
మనసులో స్థానం: మీరు ప్రేమించే వారికి మీ మనసులో సుస్థిరమైన స్థానం ఉందని భరోసానివ్వడం. ఒకరికోసం ఒకరు ఉన్నారనే సురక్షితమైన భావనను కలిగిస్తే, అది కూడా మరొక ప్రేమ భాష.
(4 / 6)
ఓదార్పు: జీవితంలో ఏవైనా సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు మనకు ఓదార్పునిచ్చే వారు ఉండటం, భరోసానిచ్చే వారు ఉండటం అవసరం. అది కూడా ప్రేమకు ఒక భాషే.
(Unsplash)(5 / 6)
సాన్నిహిత్యం: అప్పుడప్పుడు ఉల్లాసంగా ఉండటం, భాగస్వామికి ఉద్రేకాన్ని సృష్టించడం, ఇరువురు ఫోర్‌ప్లేలో నిమగ్నమవడం కూడా ప్రేమకు ఒక శృంగారభరితమైన భాష.
(Unsplash)ఇతర గ్యాలరీలు