తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nita Ambani Saree : నీతా అంబానీకి చీర కట్టినందుకు డిజైనర్‌కు 2 లక్షల రూపాయలు!

Nita Ambani Saree : నీతా అంబానీకి చీర కట్టినందుకు డిజైనర్‌కు 2 లక్షల రూపాయలు!

Anand Sai HT Telugu

05 March 2024, 14:00 IST

    • Nita Ambani Saree : అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ గురించి దేశమంతా చర్చించింది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా వేడుకలు జరిగాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. కేవలం చీర కట్టినందుకే లక్షల్లో డబ్బులు తీసుకున్నారు డిజైనర్లు.
నీతా అంబానీ
నీతా అంబానీ (ANI Twitter)

నీతా అంబానీ

మన ఇళ్లలో ఫంక్షన్ జరిగితే చీర కట్టేందుకు ఎవరో ఒకరు ఇంట్లోని మహిళలు ముందుకు వస్తారు. ఎవరూ లేకుంటే ఇంటి పక్క ఆడవాళ్లైనా చీరకడతారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. కానీ చీరకట్టినందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేసే వారు కూడా ఉన్నారు. అవును మీరు నమ్మకపోయినా ఇది నిజం. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్‌లో ఎంతో ఘనంగా చేశారు. ఈ సందర్భంగా చీరకట్టేందుకు వచ్చిన డిజైనర్‌కు లక్షల్లో ఇచ్చారు. ఇది తెలిసి జనాలు షాక్ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. చీర అనేది తరతరాలుగా భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. మన దేశ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి. భారతీయ చీరకు వేల సంవత్సార చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోని ఇప్పటికీ ఎక్కువగా వాడే పురాతన వస్త్రాధారణలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే చీర కట్టుకోవడానికి ఎవరికైనా రూ.2 లక్షలు చెల్లిస్తారా? డాలీ జైన్‌ అనే డిజైనర్ చీర కట్టేందుకు రూ.35000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తారు.

నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధిక మర్చంట్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణెలాంటివారు చీరకట్టేందుకు కూడా డిజైనర్‌ను మాట్లాడుకుంటారు. డాలీ జైన్ ఈ పనే చేస్తుంది. డాలీ జైన్ బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి చీరలతో ఆకర్షితురాలైంది. పెళ్లి చేసుకుని కోల్‌కతాకు వెళ్లే వరకు ఆమె చీరలు కట్టుకునేందుకు ఆసక్తి చూపలేదు.

తర్వాత ఆమె తన చీరను కొత్త పద్ధతిలో కట్టుకోవడం ప్రారంభించింది. ఆమె చీర కట్టుకునే విధానం చాలా మందికి నచ్చేది. 2011లో డాలీ జైన్ వేగవంతంగా (18.5 సెకన్లు) చీర కట్టుకుని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఆ సమయంలో ఆమె ఇదే తన వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె దగ్గరివారు నవ్వుతూ హేళన చేసేవారు.

ఇతర మహిళలకు డ్రేపింగ్ టెక్నిక్‌ల నేర్పించడంతో పాటు, పెళ్లి చీరలు కట్టడంలో వధువులకు సహాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. డిజైనర్ సందీప్ ఖోస్లా ద్వారా సెలబ్రెటీ క్లయింట్‌లకు పరిచయం అయింది. చివరికి ఆమె చీర కట్టడాన్ని తన కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

డాలీ జైన్ చాలా సంవత్సరాలుగా హైదరాబాదీ నుండి గుజరాతీ వరకు, రాజస్థానీ నుండి అస్సామీ వరకు, లెహెంగా నుండి మరింత ఆధునిక దుస్తుల వరకూ ఎలా అయితే బాగుంటుందో చెబుతుంది. 357 రకాల్లో చీరను కట్టుకోవచ్చని చెబుతుంది ఆమె. చీర కట్టుకోవడంలో అనేక రకాలు ఉన్నాయి అంటుంది.

డాలీ ఇప్పుడు సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా పని చేస్తుంది. ఆమె అంబానీ ఇంట్లో వేడుకల్లో పలువురు సెలిబ్రిటీలకు చీరలు కట్టింది. నీతా అంబానీ, రాధికా మర్చంట్‌, దీపికా పదుకొణెకు కూడా డాలీ జైన్ చీర కట్టింది. నివేదికల ప్రకారం డాలీ జైన్ చీర కట్టేందుకు రూ.35,000 నుండి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుంది. అనేక మంది సెలబ్రిటీలకు చీరలు కడుతుంది.

తదుపరి వ్యాసం