Protective Clothing : హైదరాబాదీ అద్భుత సృష్టి - మంటలను కూడా తట్టుకునే 'డ్రెస్' రూపకల్పన
Protective clothing News: ఓ హైదరాబాదీ అద్బుతమైన దుస్తువులకు రూపకల్పన చేశాడు. కనిష్ట ఉష్ణోగ్రతల చలిని తట్టుకోవటమే కాదు… భగభగ మండే నిప్పుల నుంచి కూడా రక్షణ కల్పించేలా డ్రెస్ ను రూపొందించాడు.
Protective Clothing: హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకునే దుస్తులను తయారుచేసి సత్తా చట్టాడు హైదరాబాద్ నగరానికి చెందిన పెద్దినేని సాయి తేజ. వీరా అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ నిర్వహిస్తున్న సాయి తేజ.....ప్రమాదకరమైన అగ్నిపర్వతాలను అధిరోహిస్తూ వాల్కనో మ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు పొందాడు. మైనస్ 200 నుంచి 1000 సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక డ్రెస్ తయరు చేశాడు సాయి తేజ.
విశేషాలివే…
సాధారణంగా ఏవైనా దుస్తులు, వస్తువులు 100 నుంచి 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కాలిపోతాయి.కానీ వాల్కనో మ్యాన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన దుస్తులకు మాత్రం మైనస్ 200 నుంచి 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా ఎలాంటి మార్పులు ఉండవు. భారత రక్షణ రంగంతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు,శీతల ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇది ఉపయోగపడుతుందని సాయి తేజ పెద్దినేని తెలిపారు. సాహస పర్యాటకులకు కూడా ఈ దుస్తులు ఎంతో ఉపయోగపడతాయని అయన అన్నారు. ప్రత్యేక మిశ్రమంతో తయారు చేయబడిన ఈ దుస్తులు తీవ్ర ఉష్ణోగ్రతలను,తక్కువ ఉష్ణోగ్రతలను ( చలిని) ఎదుర్కొనేందుకు వీలు కల్పిస్తుంది అన్నారు. సూట్ లోపల ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి దగ్గరగా ఉంటుందని, ఇది కఠినమైన వాతావరణంలో కూడా సౌకర్యంగా ఉంటుందని సాయి తేజ వివరించారు. సియాచిన్ గ్లేసియర్ వంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు - 50,-60 కన్న తక్కువగా ఉన్నా....డ్రెస్ లోపల మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయన్నారు. అలాగే వేడి 1000 సెంటిగ్రేట్లో ఉష్ణోగ్రతలు ఉన్న ... లోపల మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటాయని తెలిపారు. ఏదో ఒక రోజు లవాలోకి ప్రవేశించిన తొలి వ్యక్తిగా తనకు గుర్తింపు పొందేందుకు ఈ సూట్ తయారు చేసినట్లు పెద్దనేని సాయి తేజ వెల్లడించారు.
అందుకోసమే రూపొందించాను......
తాను దాదాపు రెండేళ్లు కష్టపడి,ఎన్నో సవాలను ఎదుర్కొని డ్రెస్ ను రూపొందించినట్లు సాయితేజ చెప్పారు. రక్షణ రంగం అలాగే అగ్ని అగ్నిమాపక దళం, ఎక్కువ ఉష్ణోగ్రతలో పనిచేసే కార్మికులు, తక్కువ ఉష్ణోగ్రతలో పనిచేసే వారిని,అలాగే సాహస పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కూడా దీనిని తయారు చేసినట్లు సాయి తేజ తెలిపారు.తాను రూపొందించిన ఈ బ్రాండ్ కు వీర అని పేరు పెట్టినట్లు తెలియచేశారు. అగ్నిపర్వతాలను అధిరోహించడం ప్రమాదమే అయినా.... సాయి తేజ మాత్రం ఇష్టపడుతాడు.
2014 నుంచి సాయి తేజ పర్వతాలను ఎక్కడానికి శ్రీకారం చుట్టాడు.లావా వెళ్ళగక్కే క్రియ శీల అగ్ని పర్వతాలను అధిరోహించాలని కుతూహలం తనకు 23 ఏళ్ళ ఉన్నపుడే కలిగిందని ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ వెల్లడించాడు.జీవితంలో అన్నీ ఉన్న ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతూనే ఉండేదని సాయి తేజ చెప్పాడు.కాగా 2019లో అగ్నిపర్వతం ఎక్కుతూ.... ఇండోనేషియాలో సాయి తేజ ప్రమాదానికి గురయ్యాడు.
రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.
టాపిక్