తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yadaloyallo Indradanassu: స్టార్ మాలో కొత్త సీరియల్.. ఎదలోయల్లో ఇంద్రధనస్సు.. ఎప్పటి నుంచంటే..

YadaLoyallo Indradanassu: స్టార్ మాలో కొత్త సీరియల్.. ఎదలోయల్లో ఇంద్రధనస్సు.. ఎప్పటి నుంచంటే..

Hari Prasad S HT Telugu

19 April 2023, 15:49 IST

    • YadaLoyallo Indradanassu: స్టార్ మాలో కొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఎదలోయల్లో ఇంద్రధనస్సు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ ఈ మధ్యే రిలీజ్ చేసింది.
స్టార్ మాలో కొత్త సీరియల్ ఎదలోయల్లో ఇంద్రధనస్సు
స్టార్ మాలో కొత్త సీరియల్ ఎదలోయల్లో ఇంద్రధనస్సు

స్టార్ మాలో కొత్త సీరియల్ ఎదలోయల్లో ఇంద్రధనస్సు

YadaLoyallo Indradanassu: తెలుగులో టాప్ సీరియల్స్ ను రూపొందిస్తున్న స్టార్ మా ఛానెల్ నుంచి మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఎదలోయల్లో ఇంద్రధనస్సు. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ సీరియల్ వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 24 నుంచి టెలికాస్ట్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Best Movies: 5 ఓటీటీల్లోని 5 బెస్ట్ సినిమాలు ఇవే! ప్రతిదీ టాప్‌లో స్ట్రీమింగ్.. మీరెన్ని చూశారు?

Madhavan: మాధ‌వ‌న్ మిస్ చేసుకున్న ల‌వ్‌స్టోరీ థియేట‌ర్ల‌లో 200 రోజులు ఆడింది - ఆ మూవీ ఏదంటే?

Rama Janmabhoomi: స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!

Jyothi Rai: ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌కు జ్యోతిరాయ్ ఆర్థిక స‌హాయం - గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తిపై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ఎదలోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుందని తాజా ప్రోమోలో స్టార్ మా వెల్లడించింది. పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన ఓ అమ్మాయి.. నగరంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అయితే తెలుగు మీడియం చదివిన నువ్వు.. ఇంగ్లిష్ మీడియం పిల్లలకు ఎలా చెబుతావంటూ స్కూల్ ఓనర్ ప్రశ్నిస్తాడు.

ఏ మీడియంలో చదివామన్నది ముఖ్యం కాదు.. చెప్పగలనా లేదా అన్నది నా ప్రతిభపై ఆధారపడి ఉంటుందని ఆ అమ్మాయి కూడా దీటుగా సమాధానమిస్తుంది. ఇంతలో ఓ క్లాస్ లో పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ ప్యూన్ వచ్చి చెబుతాడు. ఆ క్లాస్ పిల్లలను కంట్రోల్లో పెట్టు.. ఈ ఉద్యోగం నీదే అని ఆ స్కూల్ ఓనర్ సవాలు విసురుతాడు.

ఈ సవాలును స్వీకరించిన ఆ అమ్మాయి.. క్లాస్ రూమ్ లో అడుగుపెట్టి పిల్లల అల్లరిని కంట్రోల్ చేస్తుంది. అది చూస్తున్న స్కూల్ ఓనర్ వారం రోజుల్లో ఆమె పారిపోతుంది అని అంటాడు. ఇంతలో "ప్రతిభకు ఏదీ అడ్డం కాదని ఈ పంతులమ్మ నిరూపించగలదా" అనే వాయిస్ ఓవర్ తో ప్రోమో ముగుస్తుంది. పాపులర్ బెంగాలీ సీరియల్ కు ఇది రీమేక్. ఈ ఎదలోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ లో ఏక్‌నాథ్ పరుచూరి లీడ్ రోల్ లో కనిపిస్తున్నాడు.

ఇప్పటికే తెలుగులోని టాప్ సీరియల్స్ లో టీఆర్పీ రేటింగ్ ప్రకారం టాప్ 5లో ఉన్న సీరియల్స్ అన్నీ స్టార్ మాకు చెందినవే. బ్రహ్మముడి, నాగ పంచమి, గుప్పెడంత మనసు, మల్లీలాంటి సీరియల్స్ ఇందులో ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం