తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunny Leone: బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా.. విదేశీయులతో సన్నీ లియోన్ తెలుగు షో

Sunny Leone: బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా.. విదేశీయులతో సన్నీ లియోన్ తెలుగు షో

Sanjiv Kumar HT Telugu

05 October 2023, 13:03 IST

  • Sunny Leone Telugu Medium i School Show: సరికొత్త కార్యక్రమాలతో అలరించే ప్రముఖ ఛానెల్ జీ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. శృంగార తారగా పేరుగాంచిన సన్నీ లియోన్‌తో ఓ కార్యక్రమం ప్రసారం చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సన్నీ లియోన్ తెలుగు మీడియం ఐస్కూల్ టీవీ షో
సన్నీ లియోన్ తెలుగు మీడియం ఐస్కూల్ టీవీ షో

సన్నీ లియోన్ తెలుగు మీడియం ఐస్కూల్ టీవీ షో

Zee Telugu: ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్​తో టెలివిజన్​ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది జీ తెలుగు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూనే కడుపుబ్బా నవ్వించేందుకు ‘తెలుగు మీడియం ఐస్కూల్’ అనే విభిన్నమైన నాన్​ ఫిక్షన్ ​షోతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ముఖ్య అతిథిగా ఈ షో ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

ఎనిమిది మంది

జీ తెలుగులో ఆదివారం (అక్టోబర్ 8) నుంచి రాత్రి 9 గంటలకు తెలుగు మీడియం ఐస్కూల్ షోను ప్రసారం చేయనున్నారు. ఇందులో ఎనిమిది మంది తెలుగు మెంటర్స్​, తెలుగు భాషపై ఏమాత్రం అవగాహనలేని ఎనిమిది మంది విదేశీ పోటీదారులకు తెలుగు భాషను బోధించే ఛాలెంజ్​ని స్వీకరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు భాషలోని మెళకువలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకోవడంతో పాటు అంతులేని వినోదాన్ని పంచుతుంది.

వివిధ దేశాలకు చెందిన

అప్పారావు, మహేష్ విట్టా, గోమతి, అరియానా, రష్మీ, ఫైమా, భద్రం, రంగస్థలం మహేష్ వంటి పాపులర్​ తెలుగు కమెడియన్లు మెంటర్స్​ జాబితాలో ఉన్నారు. అమెరికాకు చెందిన అలీజా, స్కాట్లాండ్​కు చెందిన సామి జోనాస్ హీనీ, జపాన్​కు చెందిన సుయోషి యమమోటో సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ విద్యార్థుల సమూహంలో ఉన్నారు. ఎనర్జిటిక్​ యాంకర్​ రవి, పండు బాబాయ్, అబ్బాయిలుగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

సెన్సేషనల్​ ఎంట్రీ

తెలుగు మీడియం ఐస్కూల్ లాంచ్​ ఎపిసోడ్​‌కు బాలీవుడ్​ బ్యూటీ సన్నీ లియోన్​ సెన్సేషనల్​ ఎంట్రీ ఇవ్వనుంది. అన్నింటికంటే హైలెట్​‌గా సన్నీ లియోన్​ అచ్చ తెలుగులో మాట్లాడం కానుంది. ఈ లాంచ్​ ఎపిసోడ్​లో ప్రముఖ సింగర్​ మనో కూడా భాగం కానున్నారు.

డబుల్ ధమాకా

‘జీ తెలుగుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష గురించి తెలుసుకోవడం, తెలుగులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆహ్లాదభరితంగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. జీ తెలుగులో ప్రసారం కానున్న తెలుగు మీడియం ఐస్కూల్​ని మీరూ తప్పక చూడండి’ అని సన్నీ లియోన్ తెలిపింది. బుల్లితెరపై వినోదంతో తెలుగు నేర్పించడమేకాకుండా సన్నీతో డబుల్ ధమాకా ఇవ్వనుంది జీ తెలుగు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం