తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan Surprise Visit: అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన శృతిహాసన్.. థియేటర్లో సందడి చేసిన ముద్దుగుమ్మ

Shruti Haasan Surprise Visit: అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన శృతిహాసన్.. థియేటర్లో సందడి చేసిన ముద్దుగుమ్మ

10 September 2022, 7:11 IST

    • Shruti Haasan in 3 Movie re release Theatre: శృతిహాసన్ నటించిన 3 చిత్రం విడుదలై 10 ఏళ్ల కావస్తున్న సందర్భంగా.. ఆ సినిమా మరోసారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో సర్‌ప్రైజ్ విజట్ చేశారు శృతి.
శృతి హాసన్
శృతి హాసన్ (HT)

శృతి హాసన్

Shruti Haasan Viral Video: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో హిట్టయిన సినిమాల రీ రిలీజ్ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. తమ హీరోల పుట్టినరోజుకో.. లేదా సినిమాకు సంబంధించిన ప్రత్యేక రోజుల సందర్భంగానో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు పోకిరి చిత్రాన్ని ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా.. ఇటీవలే పవర్ స్టార్ పుట్టిన రోజున జల్సా, తమ్ముడు చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. తాజాగా ధనుష్, శృతిహాసన్ నటించిన 3 సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా మళ్లీ విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న తరుణలో అభిమానులను మరో సర్‌ప్రైజ్ దొరకింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

3 సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్లో శృతి హాసన్ అకస్మాత్తుగా ప్రవేశించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి వరకు స్క్రీన్‌పై కనిపించిన హీరోయిన్.. కళ్ల ముందు కనిపించేసరికి ప్రేక్షకులు అవాక్కవడంతో పాటు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ మేరకు శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు ఆ సినిమాలో పాట కూడా పాడారు.

కన్నులదా అంటూ సాగే ఈ పాటను శృతిహాసన్ ఆలపించారు. ప్రేక్షకులు కూడా శృతితో పాటు గొంతును కలిపారు. ఈ దృశ్యాన్ని థియేటర్లో ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో.. శృతిహాసన్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తెలుగులో ఏకంగా 150 హౌస్ ఫుల్‌ షోలు పడ్డాయి. మరోసారి విడుదలైనప్పటికీ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

"3 సినిమా విడుదలై 10 ఏళ్లు కావడంతో తెలుగులో దీన్ని మరోసారి విడుదల చేశారు. ఈ వేడుకను సెలబ్రేట్ చేయడానికి సర్‌ప్రైజ్ విజిట్ చేశాను" అంటూ శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక వీడియోకు క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం శృతిహాసన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని-బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న NBK107లో నటిస్తున్న శృతిహాసన్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్‌లోనూ హీరోయిన్‌గా చేస్తుంది. ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేర్ వీరయ్యలోనూ నటిస్తోంది. క్రాక్ సినిమా విజయంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా అయింది ఈ ముద్దుగుమ్మ.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం