Shruti Haasan Dance Video Viral: కమల్ సాంగ్‌కు శృతి హాసన్ డ్యాన్స్.. వీడియో మాత్రం ఫుల్ వైరల్ -shruti haasan damced her father kamal haasan and video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shruti Haasan Damced Her Father Kamal Haasan And Video Goes Viral

Shruti Haasan Dance Video Viral: కమల్ సాంగ్‌కు శృతి హాసన్ డ్యాన్స్.. వీడియో మాత్రం ఫుల్ వైరల్

Maragani Govardhan HT Telugu
Sep 04, 2022 07:47 AM IST

Shruthi Stepped Kamal Song: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి పాటకు స్టెప్పులేస్తూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

శృతి హాసన్ వైరల్ వీడియో
శృతి హాసన్ వైరల్ వీడియో (Instagram)

Shruthi Haasan Stepped Kamal Song: కమల్ హాసన్ కూతురుగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. ఆ మధ్య కాస్త సినిమాలకు విరామం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలను చేజ్కిక్కించుకుంటోంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన శృతి.. వీలుచిక్కినప్పుడల్లా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. గతేడాది గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా అదిరిపోయే వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

శృతిహాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్ వీడియో ఒకటి పంచుకుంది. ఈ వీడియోను గమనిస్తే.. కమల్ హాసన్ పాత పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. బోల్డ్ మేకప్‌తో బ్లాక్ లేటెస్క్ జంప్ సూట్‌తో శృతి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇంతకు ఈ బ్యూటీ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే కమల్ క్లాసిక్ సాంగ్ రాజా కాయ వచ్చే.. అనే సూపర్ హిట్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతిహాసన్ తన అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. అనతంరం వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. ఈ అమ్మడు ప్రస్తుతం గోపిచంద్ మలినేని-బాలకృష్ణ కాంబోనేషన్‌లో రానున్న NBK 107 సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ప్రభాస్ పాన్ఇండియా చిత్రం సలార్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఓ సినిమాకు సంతకం చేసింది. ఇలా తెలుగులో టాప్ స్టార్ హీరో సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

IPL_Entry_Point

సంబంధిత కథనం