తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sexual Harassment Charges: 'స్క్విడ్ గేమ్' తాతపై లైంగిక ఆరోపణలు.. ఖండించిన దక్షిణకొరియా నటుడు

Sexual harassment charges: 'స్క్విడ్ గేమ్' తాతపై లైంగిక ఆరోపణలు.. ఖండించిన దక్షిణకొరియా నటుడు

25 November 2022, 22:17 IST

  • Sexual harassment charges: ప్రముఖ పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‌లో కీలక పాత్ర పోషించిన ఓహ్ యోంగ్ సూ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఓ యువతిపై అనుచితంగా ప్రవర్తించారనే కారణంగా ఆయనపై కేసు నమోదైంది.

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు (Movie still image)

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Sexual harassment charges: దక్షిణకొరియా వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లు చూసే అలవాటున్న వారికి ఈ పేరు చాలా సుపరిచితం. గతేడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో అనువాదమై ఆయా ప్రాంతాల్లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్‌లో నటించిన హీరోతో పాటు కీలక పాత్ర పోషించిన చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ఓహ్ యోంగ్ సూ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. స్క్విడ్ గేమ్ తాతగా పాపులరైన ఓహ్ యోంగ్ సూ ఈ సిరీస్‌లో అత్యంత కీలక పాత్రలో నటించారు. అయితే ఈ నటుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఎలాంటి నిర్భందం లేకుండానే విడుదలైన సంగతి మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

వివరాల్లోకి వెళ్తే.. 78 ఏళ్ల యోంగ్ సూ 2017లో ఓ మహిళను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణకొరియా మీడియా రిపోర్టుల ప్రకారం ఈ అంశంపై సదరు యువతి యోంగ్ సూపై 2021 డిసెంబరులు ఫిర్యాదు చేసింది. ఏప్రిల్‌లో ఈ కేసు మూసివేసినప్పటికీ.. బాధితురాలి ఫిర్యాదుపై మళ్లీ ఓపెన్ చేశారు. ఈ కేసు విచారణ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను యోంగ్ సూ తిరస్కరించారు. "ఓ సరస్సు చుట్టూ తిరుగుతూ ఆమెకు గైడ్ చేసే సమయంలో చేతిని తాకాను. వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాను. ఈ విషయంపై ఆమె గొడవ చేయనని చెప్పింది. అంతమాత్రాన నేను ఆరోపణలను అంగీకరించినట్లు కాదు." అని యోంగ్ సూ తెలిపారు.

నెట్ ఫ్లిక్స్ సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులరైంది. ఈ సిరీస్‌లో ఆయన 001 నెంబర్ కలిగిన తాత పాత్రలో నటించారు. దక్షిణకొరియాలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నటులు. ప్రస్తుతం ఉత్తరకొరియాలో భాగమైన కేసోంగ్‌లో 1944లో ఆయన జన్మించారు. స్ట్రీట్ కార్ అనే కొరియన్ ప్రసిద్ధ నాటక సంస్థలో 200కి పైగా నాటకాల్లో నటించారు. అనంతరం సినిమాల్లో అరంగేట్రం చేసిన ఆయన స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ర్పింగ్, ఏ లిటిల్ మాంక్, సోల్ గార్డెన్స్ లాంటి అనేక ప్రదర్శనలు, సినిమాల్లో కనిపించారు. స్క్విడ్ గేమ్‌తో ఆయన వరల్డ్ వైడ్ గుర్తింపుతెచ్చుకున్నారు. ఇది కాకుండా చాక్లెట్, గాడ్ ఆఫ్ వార్, ది గ్రేట్ సియోన్‌డియోక్, మూన్ రివర్ లాంటి డ్రామా సిరీస్‌ల్లోనూ కనిపించారు.

సెప్టెంబరు 2021లో వచ్చిన స్క్విడ్‌గేమ్ ఆయన నటనలో మైలురాయిగా మిగిలిపోయింది. ఈ సిరీస్‌లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, లీ బైంగ్ హూన్, లీ జీ హా, అనుపమ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సిరీస్‌లో ఆయన నటనకు కూడా ఎమ్మీ నామినేషన్ కూడా పొందారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం