Emmy Awards 2022 winners Full List: ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్ రికార్డు.. విజేతల పూర్తి వివరాలివిగో-here the full list of the winners of 2022 emmy awards ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Emmy Awards 2022 Winners Full List: ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్ రికార్డు.. విజేతల పూర్తి వివరాలివిగో

Emmy Awards 2022 winners Full List: ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్ రికార్డు.. విజేతల పూర్తి వివరాలివిగో

Sep 13, 2022, 12:51 PM IST Maragani Govardhan
Sep 13, 2022, 12:51 PM , IST

  • Emmy Awards 2022: సినిమాలకు అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డులనే చెప్పవచ్చు. అలాగే బుల్లితెరకు ఎమ్మీ అవార్డులు ఆస్కార్లకు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రతి ఏటాలానే ఈ సంవత్సరం కూడా ఎమ్మి అవార్డ్స్ 2022 ప్రదానం జరిగింది. ఈ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న విదేశీ సిరీస్‌గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. మొత్తం 14 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. డ్రామా సిరీస్‌ విభాగంలో ఈ సిరీస్ ను తెరకెక్కించిన హ్యాంగ్ డాంగ్ హ్యాక్ ఉత్తమ దర్శకుడిగా(Outstanding Director) పురస్కారం సాధించగా.. ప్రధాన పాత్ర పోషించిన లీ జాంగ్ జే ఉత్తమ నటుడి(Outstanding Lead Actor) విభాగంలో అవార్డు దక్కించుకున్నాడు. ఎమ్మీ దక్కించుకున్న చివరి ఆంగ్లేతర సిరీస్ స్క్విడ్ గేమ్ కాకూడని తాను ఆశిస్తున్నట్లు ఈ సిరీస్ దర్శకుడు హ్వాంగ్ చెపపాడు.

యూఫోరియా అనే డ్రామా సిరీస్‌లో నటనగానూ గాను జెండయాకు అత్యుత్తమ లీడ్ యాక్ట్రెస్ విభాగంలో ఎమ్మీ అవార్డు లభించింది.

(1 / 10)

యూఫోరియా అనే డ్రామా సిరీస్‌లో నటనగానూ గాను జెండయాకు అత్యుత్తమ లీడ్ యాక్ట్రెస్ విభాగంలో ఎమ్మీ అవార్డు లభించింది.(AP)

74వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్‌ 14 నామినేషన్లు అందుకుంది. ఈ సిరీస్‌లో అత్యుత్తమ నటన కనబర్చిన లీ జంగ్ జే అత్యుత్తమ లీడ్ యాక్టర్ విభాగంలో పురస్కారం సాధించాడు.

(2 / 10)

74వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్‌ 14 నామినేషన్లు అందుకుంది. ఈ సిరీస్‌లో అత్యుత్తమ నటన కనబర్చిన లీ జంగ్ జే అత్యుత్తమ లీడ్ యాక్టర్ విభాగంలో పురస్కారం సాధించాడు.(REUTERS)

టెడ్ లాసో అనే కామెడీ సిరీస్‌కు దర్శకత్వం వహించినందుకు గానూ ఎంజే డేలానీకి అత్యుత్తమ డైరెక్టర్ విభాగంలో అవార్డు దక్కించుకుంది.

(3 / 10)

టెడ్ లాసో అనే కామెడీ సిరీస్‌కు దర్శకత్వం వహించినందుకు గానూ ఎంజే డేలానీకి అత్యుత్తమ డైరెక్టర్ విభాగంలో అవార్డు దక్కించుకుంది.(REUTERS)

వైట్ లోటస్ సిరీస్‌లో నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా జెన్నిఫర్ కూలిడ్జ్ ఎమ్మీ సాధించింది.

(4 / 10)

వైట్ లోటస్ సిరీస్‌లో నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా జెన్నిఫర్ కూలిడ్జ్ ఎమ్మీ సాధించింది.(AP)

జెరోడ్ కార్మిచేల్ ఉత్తమ రైటింగ్ విభాగంలో అవార్డు సాధించారు.

(5 / 10)

జెరోడ్ కార్మిచేల్ ఉత్తమ రైటింగ్ విభాగంలో అవార్డు సాధించారు.(AP)

కామెడీ సిరీస్ విభాగంలో టెడ్ లాసోలో నటనకు గాను జేసన్ సుడెకిస్ ఎమ్మీని సాధించాడు.

(6 / 10)

కామెడీ సిరీస్ విభాగంలో టెడ్ లాసోలో నటనకు గాను జేసన్ సుడెకిస్ ఎమ్మీని సాధించాడు.(AP)

ది డ్రాప్ ఔట్ లిమిటెడ్ సిరీస్‌లో నటనకు గానూ అమాండా సెట్ ఫ్రైడ్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.

(7 / 10)

ది డ్రాప్ ఔట్ లిమిటెడ్ సిరీస్‌లో నటనకు గానూ అమాండా సెట్ ఫ్రైడ్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.(AP)

సక్సెషన్ అనే డ్రామా సిరీస్‌ను రాసినందుకు ఔట్ స్టాండింగ్ రైటర్ అవార్డును జెస్సీ ఆర్మ్‌స్ట్రాంగ్ స్వీకరించారు.

(8 / 10)

సక్సెషన్ అనే డ్రామా సిరీస్‌ను రాసినందుకు ఔట్ స్టాండింగ్ రైటర్ అవార్డును జెస్సీ ఆర్మ్‌స్ట్రాంగ్ స్వీకరించారు.(REUTERS)

కామెడీ సిరీస్ అత్యుత్తమ ప్రధాన నటింగా జీన్ స్మార్ట్ గెలిచింది. హ్యాక్స్ అనే కామెడీ సిరీస్‌లో నటనకు ఆమెకి ఈ అవార్డు దక్కింది.

(9 / 10)

కామెడీ సిరీస్ అత్యుత్తమ ప్రధాన నటింగా జీన్ స్మార్ట్ గెలిచింది. హ్యాక్స్ అనే కామెడీ సిరీస్‌లో నటనకు ఆమెకి ఈ అవార్డు దక్కింది.(REUTERS)

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు