తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Dhamaka Trailer: మాస్ స్ట్రోమ్‌కు సిద్ధంగా ఉండండి.. 'ధమాకా' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

Ravi Teja Dhamaka Trailer: మాస్ స్ట్రోమ్‌కు సిద్ధంగా ఉండండి.. 'ధమాకా' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

11 December 2022, 11:38 IST

    • Ravi Teja Dhamaka Trailer: రవితేజ హీరోగా నటించిన ధమాకా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించింది.
డిసెంబరు 15న ధమాకా ట్రైలర్
డిసెంబరు 15న ధమాకా ట్రైలర్

డిసెంబరు 15న ధమాకా ట్రైలర్

Ravi Teja Dhamaka Trailer: మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చూస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో సందడి చేసిన ఆయన.. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 23న ధమాకా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ఫలితంగా మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

డిసెంబరు 15 నుంచి మాస్‌స్ట్రోమ్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 15న ట్రైలర్‌ను 23న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ.. మళ్లీ తనదైన మాస్ శైలితో పాటు.. వినోదాన్ని ఫుల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలీలతో రవితేజ కెమిస్ట్రీ అదిరిపోయింది. వీరిద్దరూ కలిసి మాస్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం