తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Movie Title Change: 'ఉస్తాద్ భగత్‌సింగ్‌'గా పవర్‌స్టార్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం

Pawan Kalyan Movie Title Change: 'ఉస్తాద్ భగత్‌సింగ్‌'గా పవర్‌స్టార్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం

11 December 2022, 10:14 IST

    • Pawan Kalyan Movie Title Change: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్ భగత్‌సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్

Pawan Kalyan Movie Title Change: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటేనే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ ఆయనతో గతంలో హిట్ ఇచ్చిన దర్శకుల కాంబోలో సినిమా రాబోతుందంటే ఆ క్రేజే వేరేలా ఉంటుంది. పవర్‌స్టార్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి వీరిద్దరి కాంబినేషన్‌‌లో భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో.. ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో వీటన్నింటికీ చెక్ పెడుతూ.. చిత్రబృందం సినిమాకు సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

సినిమా టైటిల్‌ను మారుస్తూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. "భవదీయుడు భగత్‌సింగ్" అని కాకుండా "ఉస్తాద్ భగత్‌సింగ్" అనే టైటిల్‌ను ఖరారు చేసింది. "మనల్ని ఎవడ్రా ఆపేది" అనేది ట్యాగ్ లైన్. పోస్టర్‌ను గమనిస్తే.. ఈ ట్యాగ్ లైన్‌తో పాటు ఈ సారి కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. అనే థీమ్ లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం