తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan On Rajamouli: అందుకే రాజమౌళిని ఇండియా స్పీల్‌బర్గ్ అంటారు..: రామ్ చరణ్

Ram Charan on Rajamouli: అందుకే రాజమౌళిని ఇండియా స్పీల్‌బర్గ్ అంటారు..: రామ్ చరణ్

Hari Prasad S HT Telugu

23 February 2023, 10:41 IST

    • Ram Charan on Rajamouli: అందుకే రాజమౌళిని ఇండియా స్పీల్‌బర్గ్ అంటారు అని రామ్ చరణ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న చెర్రీ.. తన డైరెక్టర్ ను ఆకాశానికెత్తాడు.
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్

గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్

Ram Charan on Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలుసు కదా. ఆస్కార్స్ సెర్మనీలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన చెర్రీ.. అంతకుముందే మరో రెండు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. ప్రముఖ ఛానెల్ ఏబీసీలో వచ్చే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా చరణ్ నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

ఇక శుక్రవారం (ఫిబ్రవరి 24) అమెరికా క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల సెర్మనీలోనూ పాల్గొననున్నాడు. ఇక తాజాగా బుధవారం (ఫిబ్రవరి 22) గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళితోపాటు కొన్ని ఇతర అంశాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జక్కన్ననైతే ఆకాశానికెత్తడం విశేషం.

"ఆర్ఆర్ఆర్ సినిమా గొప్ప స్నేహం, గొప్ప సోదరభావం, రెండు పాత్ర మధ్య ఉన్న సంబంధాల గురించి తీసినది. నా డైరెక్టర్ రాజమౌళి గొప్ప రైటింగ్స్ లో ఇదీ ఒకటి. అందుకే అతన్ని ఇండియా స్టీవెన్ స్పీల్‌బర్గ్ అంటారు. అతడు త్వరలోనే గ్లోబల్ సినిమాలోకి వస్తాడని నేను ఆశిస్తున్నా" అని రామ్ చరణ్ అనడం గమనార్హం. ఇండియా ఫిల్మ్ మేకింగ్ గొప్పతనమేంటో నాటు నాటు చిత్రీకరణతో తెలిసిందని, ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సిందని చెప్పాడు.

"నాకు రిహానా, లేడీ గాగా, టాప్ గన్ మ్యావెరిక్ పాటలన్నీ బాగా నచ్చాయి. కానీ ఇది ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. 85 ఏళ్లకు పైన చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాకు తొలిసారి దక్కిన అవార్డు. అకాడెమీ గుర్తించింది. గోల్డెన్ గ్లోబ్స్ గుర్తించింది. పలు ఇతర అవార్డులు కూడా వచ్చాయి. ఇది కేవలం ఆర్ఆర్ఆర్ కే కాదు మొత్తం ఇండియన్ సినిమా, ఇండియన్ టెక్నీషియన్లకు దక్కిన గౌరవం" అని రామ్ చరణ్ స్పష్టం చేశాడు.

పశ్చిమ దేశాల్లో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందని తాము ఊహించలేదని కూడా తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా వచ్చిన తర్వాత వచ్చిన అపూర్వ స్పందన తర్వాత ట్రిపుల్ ఆర్ టీమ్ అంతర్జాతీయ స్థాయిలో పర్యటనలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇండియాలో అంతటి ఆదరణ వచ్చిన తర్వాత తాము మరో ప్రాజెక్ట్ వైపు వెళ్తున్న సమయంలో ఇది ప్రారంభం మాత్రమేనన్న విషయం తమకు తెలిసిందని రామ్ చరణ్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం