తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా: రామ్ చరణ్

Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా: రామ్ చరణ్

Hari Prasad S HT Telugu

09 March 2023, 18:57 IST

    • Ram Charan Hollywood Movie: అవును.. హాలీవుడ్ మూవీలో నటించబోతున్నా అని స్పష్టం చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ప్రాజెక్ట్ విశేషాలను అతడు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Hollywood Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. అతడో గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ మూవీతో చెర్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీ రామ్ పాత్రలో ఇరగదీసిన అతడు.. పాన్ ఇండియా కాదు కదా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడిదే మూవీ కోసం అమెరికాలో ఉన్న చరణ్ ఇంటర్వ్యూ కోసం అక్కడి ఛానెల్స్ పోటీ పడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

ఈ మధ్యే చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేయబోతున్న హాలీవుడ్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్ షోలో సామ్ ఫ్రాగోసోతో మాట్లాడిన రామ్ చరణ్.. తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేశాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు కూడా వెల్లడించాడు.

"అవును ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. కచ్చితంగా ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే చర్చలు కొనసాగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి? నేను ఎప్పుడు సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాను అనే విషయాలు వచ్చే రెండు నెలల్లో తెలుస్తాయి" అని చరణ్ చెప్పడం విశేషం.

చెర్రీయే హాలీవుడ్ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అంతేకాదు ఇదే షోలో చెర్రీ మాట్లాడుతూ.. తనకు జూలియా రాబర్ట్స, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి నటీనటులతో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. ఈ మధ్యే ఓ షోలో వ్యాఖ్యాత అతన్ని బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియాగా కూడా అభివర్ణించడం విశేషం.

95వ ఆస్కార్స్ లో చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీనికోసమే అతడు ఎంతో ముందుగానే అమెరికా వెళ్లాడు. ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13) తెల్లవారుఝామున) జరగనుంది. ఈ వేడుకలోనే నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం