తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్‌ మొదలైంది.. లొకేషన్‌ పిక్‌ చూశారా?

Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్‌ మొదలైంది.. లొకేషన్‌ పిక్‌ చూశారా?

HT Telugu Desk HT Telugu

17 October 2022, 18:55 IST

    • Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్‌ మొదలైంది. ఈ మూవీ లొకేషన్‌లో తీసిన ఫొటోను మేకర్స్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేయగా.. రష్మిక మందన్నా కూడా ఆ ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.
పుష్ప 2 షూటింగ్ లొకేషన్ లో డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్
పుష్ప 2 షూటింగ్ లొకేషన్ లో డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్

పుష్ప 2 షూటింగ్ లొకేషన్ లో డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్

Pushpa 2 Shooting: పాన్‌ ఇండియా లెవల్లో సంచలనం రేపిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప: ద రూల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies on OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

సినిమా షూటింగ్‌ లొకేషన్‌కు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేశారు. సెట్స్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌తోపాటు మిగతా టీమ్‌ పని చేస్తున్న ఫొటో అది. పుష్ప ద రూల్‌ పనులు శరవేగంగా నడుస్తున్నాయంటూ ఈ ఫొటోను షేర్‌ చేశారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ అవి గోవారికర్‌, పోస్టర్‌ డిజైనర్‌ ట్యూనీ జాన్‌, మిగతా టీమంతా బెస్ట్ ఔట్‌పుట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని మైత్రీ మూవీ మేకర్స్‌ చెప్పింది.

ఈ ట్వీట్‌ను రష్మిక మందన్నా కూడా రీ ట్వీట్‌ చేసింది. అది ప్రారంభమవుతోంది.. చూడండి అంటూ రష్మిక ఈ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. నిజానికి రెండు నెలల కిందటే పుష్ప 2 పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే షూటింగ్‌ ప్రారంభించడమే ఆలస్యమైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

పుష్ప ద రైజ్‌ మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడంతో సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. అందులోనూ కేజీఎఫ్‌ 2 మూవీ సృష్టించిన ప్రభంజనంతో పుష్ప సీక్వెల్‌ కూడా అదే రేంజ్‌లో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రిప్ట్‌పై ఒకటికి రెండుసార్లు పని చేశాడు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ సుమారు రూ.125 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడన్న వార్త కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

అటు సుకుమార్‌ కూడా తన రెమ్యునరేషన్‌ పెంచేశాడని మొదట్లో వార్తలు వచ్చినా.. ఆ తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని తేలింది. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్‌ రైటింగ్స్‌ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం