Filmfare Award Telugu Winners: పుష్ప త‌గ్గేదేలే - ఫిలింఫేర్‌లో హ‌య్యెస్ట్ అవార్డ్స్ సొంతం-filmfare awards allu arjun wins best actor award telugu winners full list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Filmfare Awards Allu Arjun Wins Best Actor Award Telugu Winners Full List

Filmfare Award Telugu Winners: పుష్ప త‌గ్గేదేలే - ఫిలింఫేర్‌లో హ‌య్యెస్ట్ అవార్డ్స్ సొంతం

Nelki Naresh Kumar HT Telugu
Oct 10, 2022 09:03 AM IST

Filmfare Award Telugu Winners: ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప సినిమా మెరిసింది. మొత్తం ఏడు అవార్డుల‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Filmfare Award Telugu Winners: పుష్ప విడుద‌లై ఏడాది కావ‌స్తోన్న ఈ సినిమా క్రేజ్ త‌గ్గ‌క‌పోగా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప సినిమా మెరిసింది. ఏడు అవార్డుల‌ను ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా పుష్ప సినిమా నిలిచింది.

ఈ సినిమాకుగాను బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌ (Alluarjun), బెస్ట్ డెరెక్ట‌ర్‌గా సుకుమార్(Sukumar అవార్డుల‌ను అందుకున్నారు. అంతేకాకుండా బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిశ్రీప్ర‌సాద్‌, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్‌సింగ‌ర్‌గా సిధ్ శ్రీరామ్‌, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ఇంద్రావ‌తి చౌహాన్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా మిరోస్లా బ్రోజెక్ అవార్డుల‌ను ద‌క్కించుకున్నారు.

ల‌వ్‌స్టోరీ సినిమాలో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌ర‌చిన సాయిప‌ల్ల‌వి (Saipallavi) బెస్ట్ హీరోయిన్‌గా అవార్డును సొంతం చేసుకున్న‌ది. అలాగే శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాకుగాను క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వికే అవార్డు ద‌క్కింది.

క్రిటిక్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ హీరోగా శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో నాని అవార్డు సొంతం చేసుకున్నాడు. బెస్ట్ లిరిసిస్ట్‌గా జాను సినిమాకుగాను దివంగ‌త గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి అవార్డు ద‌క్కింది. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు గాను బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా ట‌బు , బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ అవార్డుల‌ను అందుకున్నారు.

ఉప్పెన సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్‌తేజ్‌, బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా కృతిశెట్టి అవార్డుల‌ను ద‌క్కించుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అల్లు అర‌వింద్‌కు అంద‌జేశారు. ఫిలింఫేర్‌తో పాటు సైమాలో పుష్ప సినిమా అత్య‌ధిక అవార్డుల‌ను అందుకున్న‌ది. ప్ర‌స్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభంకానుంది.

IPL_Entry_Point

టాపిక్