తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ar Rahaman : ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీని ఆపేసిన పోలీసులు

AR Rahaman : ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీని ఆపేసిన పోలీసులు

Anand Sai HT Telugu

02 May 2023, 8:11 IST

    • AR Rahaman Musical Concert : ఏఆర్ రెహమాన్ కు పోలీసులు షాకిచ్చారు. ఆయన సంగీత కచేరీని ఆపేశారు. పర్మిషన్ ఇచ్చిన సమయం గడువు దాటినందుకు పుణె పోలీసులు కచేరీని ఆపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ (twitter)

ఏఆర్ రెహమాన్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahaman) మ్యూజికల్‌ కాన్సర్ట్ పూణేలో జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులు రెహమాన్ పాటలను ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు వచ్చి షాక్ ఇచ్చారు. మధ్యలో స్టేజీ మీదకు వచ్చి ఆపేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పూణేలో లైవ్ కాన్సర్ట్ ఇచ్చారు. మధ్యలోనే పోలీసులు ప్రోగ్రాం ఆపేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. రాత్రి 10 గంటల గడువును మించిపోయారని పేర్కొంటూ వివరణ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ఏఆర్ రెహమాన్(AR Rahaman) కచేరీని పోలీసులు అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక అభిమాని వీడియోను పోస్ట్ చేసి, తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు. AR Rahman సంగీత కచేరీని రాత్రి 10.14 గంటలకు ఆపేయడం చాలా నిరాశపరిచిందని చెప్పుకొచ్చాడు. రాత్రి 10 గంటలకు గడువు ముగిసినప్పటికీ.. అతని స్థాయికి ఇలా చేయాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగే సమయంలో రెహమాన్ చివరి పాట పడుతున్నారు. ప్రదర్శనను ఆపడానికి పోలీసులు వేదికపైకి వచ్చినప్పుడు చైయా చయ్యా పాటను పాడుతున్నాడు.

ఈ ఘటనపై పూణే పోలీసులు(Pune Police) వివరణ ఇచ్చారు. 'రెహమాన్ తన చివరి పాట పాడుతున్నాడు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిందని అతనికి తెలియదు. కాబట్టి వేదిక వద్ద ఉన్న మా పోలీసు అధికారి వెళ్లి తెలియజేశాడు. మార్గదర్శకాల ప్రకారం అనుసరించాల్సిన గడువు, ఆ తర్వాత అతను పాడటం మానేశాడు.' అని పోలీసులు తెలిపారు.

పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో AR రెహమాన్ కచేరీ జరిగింది. ఈవెంట్ సమయాలు రాత్రి 8-10 గంటల వరకు ఉన్నాయి. గడువు దాటినప్పుడు పోలీసులు జోక్యం చేసుకున్నారు. గడువు ముగిసిన తర్వాత కచేరీని ఎందుకు ఆపలేదని కూడా ప్రశ్నించారు.

AR రెహమాన్ కు సంబంధించి.. ఇటీవలే ఓ వీడియో వైరల్(Video Viral) అయింది. అందులో అతను చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తన భార్యను హిందీలో మాట్లాడవద్దని కోరడం కనిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2(ponniyin selvan 2) కోసం సంగీతాన్ని అందించాడు రెహమాన్.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం