తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Searched Movies In 2023: ఇండియాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Most Searched Movies in 2023: ఇండియాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu

12 December 2023, 8:33 IST

    • Most Searched Movies in 2023: ప్రతి ఏడాదిలాగే ఈ 2023లోనూ గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ వచ్చేసింది. టాప్ 10 మూవీస్, టాప్ 10 వెబ్ సిరీస్ లిస్ట్ ఒకసారి చూద్దాం.
ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Most Searched Movies in 2023: ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా ఏది? ఇక ఎక్కువ మంది ఆసక్తి చూపిన వెబ్ సిరీస్ ఏది? ఎప్పటిలాగే 2023 ఏడాదికి సంబంధించిన టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ వచ్చేసింది. సోమవారం (డిసెంబర్ 11) ఈ లిస్ట్ ను గూగుల్ రిలీజ్ చేసింది. ఊహించినట్లే ఈ ఏడాది రెండు రూ.1000 కోట్ల సినిమాలు అందించిన షారుక్ ఖాన్ ఈ లిస్ట్ ను డామినేట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

ఇక సౌత్ నుంచి కేవలం మూడు సినిమాలు ఉండగా.. ఆ మూడు కూడా తమిళ మూవీస్ కావడం విశేషం. ఈ లిస్టులో లియో, జైలర్, వారిసు ఉన్నాయి. ఒక్క తెలుగు సినిమా కూడా ఇందులో చోటు దక్కించుకోలేదు. లిస్టులో జవాన్ టాప్ లో ఉండగా.. మరో షారుక్ ఖాన్ మూవీ పఠాన్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఆదిపురుష్ కోసం కూడా నెటిజన్లు బాగానే సెర్చ్ చేశారు.

ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే

జవాన్

గదర్ 2

ఓపెన్‌హైమర్

ఆదిపురుష్

పఠాన్

ది కేరళ స్టోరీ

జైలర్

లియో

టైగర్ 3

వారిసు

ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఓటీటీ షోలు ఇవే

ఇక ఓటీటీల విషయానికి వస్తే ఎక్కువ మంది సెర్చ్ చేసిన షోలు, వెబ్ సిరీస్ లిస్ట్ కూడా గూగుల్ రిలీజ్ చేసింది. ఇందులో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఫర్జీ టాప్ లో ఉండగా.. వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు కూడా చోటు దక్కించుకుంది.

ఫర్జీ

వెన్స్‌డే

అసుర్

రానా నాయుడు

ద లాస్ట్ ఆఫ్ అజ్

స్కామ్ 2003

బిగ్ బాస్ 17

గన్స్ అండ్ గులాబ్స్

సెక్స్ లైఫ్

తాజా ఖబర్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం