Rana Naidu 2: రానా నాయుడుతో ఫ్యాన్స్ హర్టయ్యారు - సీజన్ 2 లో బోల్డ్ కంటెంట్‌పై వెంకటేష్ క్లారిటీ
Rana Naidu 2: రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకాబోతున్నట్లు వెంకటేష్ తెలిపాడు. సీజన్ 2లో బోల్డ్ కంటెంట్‌పై వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. సైంధవ్ ప్రమోషన్స్‌లో రానా నాయుడు 2పై వెంకటేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Rana Naidu 2: రానా నాయుడు సీజన్2పై వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. జనవరి నుంచి రానా నాయుడు 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించాడు. సైంధవ్ సినిమాలోని రాంగ్ యూసేజ్ అనే పాటను హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో వెంకటేష్ రిలీజ్ చేశాడు.
ఈ ఈవెంట్‌లో రానా నాయుడు సీజన్ 2పై స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకు వెంకటేష్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. రానా నాయుడు వెబ్‌సిరీస్‌ను వరల్డ్ వైడ్‌గా చాలా మంది చూశరని వెంకటేష్ అన్నాడు.
ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో నెట్‌ఫ్లిక్స్ సెకండ్ సీజన్‌కు సిద్ధమైందని వెంకటేష్ తెలిపాడు. “సిరీస్ చూసి పెద్దోళ్లు ఎంట్రా నువ్వు అలా చేశావ్ అని విమర్శించారు. కుర్రాళ్లకు మాత్రం సిరీస్ బాగా నచ్చింది. సీజన్ వన్ విషయంలో ఫ్యాన్స్ చాలా హర్టయ్యారు. ఈ సారి ఎవరిని నొప్పించకుండా సీజన్ 2 ను జాగ్రత్తగా చేయాలని ఫిక్స్ అవుతోన్నా. బోల్డ్‌నెస్ డోస్ తగ్గినా నాగానాయుడు క్యారెక్టర్‌లోని చిలిపితనం మాత్రం తగ్గదు” అని వెంకటేష్ అన్నాడు.
రానా నాయుడు సిరీస్‌లో వెంకటేష్ తో పాటు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించాడు. తొలిసారి బాబాయ్, అబ్బాయ్ కాంబో వచ్చిన ఈ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ బోల్డ్ రోల్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. కథలో బోల్డ్ కంటెంట్ మినహా ఎలాంటి కొత్తదనం లేదంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.
రానా నాయుడు సిరీస్‌కు సూపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటిస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న పాన్ ఇండియన్ లెవెల్‌లో సైంధవ్ రిలీజ్ కాబోతోంది.