తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bramayugam Twitter Review: భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ - మ‌మ్ముట్టి న‌ట విశ్వ‌రూపం - బ్లాక్ అండ్ వైట్ మూవీ అదుర్స్‌

Bramayugam Twitter Review: భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ - మ‌మ్ముట్టి న‌ట విశ్వ‌రూపం - బ్లాక్ అండ్ వైట్ మూవీ అదుర్స్‌

15 February 2024, 9:59 IST

  • Bramayugam Twitter Review: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ భ్ర‌మ‌యుగం గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ
భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ

భ్ర‌మ‌యుగం ట్విట్ట‌ర్ రివ్యూ

Bramayugam Twitter Review: మ‌ల‌యాళంలో వైవిధ్య‌త‌కు చిరునామాగా నిలుస్తుంటాడు మెగాస్టార్ మ‌మ్ముట్టి. నెగెటివ్‌, పాజిటివ్ అనే తేడాలు లేకుండా క‌థ న‌చ్చితే ఏ పాత్ర‌నైనా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతుంటాడు. మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన తాజా మ‌ల‌యాళ చిత్రం భ్ర‌మ‌యుగం గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. తొలుత మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం భాష‌ల్లో ఒకేరోజు భ్ర‌మ‌యుగం సినిమాను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ చివ‌రి నిమిషంలో తెలుగు వెర్ష‌న్ పోస్ట్‌పోన్ అయ్యింది. మ‌ల‌యాళంలో మాత్ర‌మే ఈ మూవీ రిలీజైంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

Hari Om OTT: దేశంలోనే తొలి భక్తి ఓటీటీ హరి ఓం.. ప్రారంభిస్తున్న అడల్ట్ కంటెంట్ ఓటీటీ ఉల్లు.. పాపం నుంచి పుణ్యం!

ట్విస్ట్‌లు , ట‌ర్న్‌లు...

హార‌ర్ క‌థాంశంతో ఆద్యంతం ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో భ్ర‌మ‌యుగం సినిమా సాగుతుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. రెండు డిఫ‌రెంట్ టైమ్‌లైన్స్‌లో విభిన్నమైన పాయింట్‌తో ద‌ర్శ‌కుడు భ్ర‌మ‌యుగం సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. తేవ‌న్ అనే గాయ‌కుడు అనుకోకుండా ఓ పాడుబ‌డ్డ మ‌హ‌ల్ లోకి ప్ర‌వేశిస్తాడు. కుంజ‌మోన్ పొట్టికి చెందిన ఆ ర‌హ‌స్య మ‌హ‌ల్‌లో తేవ‌న్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాన్న‌ది ద‌ర్శ‌కుడు ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాలో చూపించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. భ్ర‌మ‌యుగం సినిమాలో హార‌ర్ అంశాల‌తో పాటు అంత‌ర్లీనంగా కుల వివ‌క్ష‌ను అంత‌ర్లీనంగా చ‌ర్చించిన‌ట్లు చెబుతోన్నారు.

నెగెటివ్ షేడ్స్‌...

పేరుకు ఈ సినిమాలో మ‌మ్ముట్టి హీరో అయినా అత‌డితో పాటు అర్జున్ అశోక‌న్‌, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ పాత్ర‌ల‌కు స‌మాన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. హీరోలు విల‌న్స్ ఎవ‌రూ ఇందులో క‌నిపించ‌ర‌ని, క్యారెక్ట‌ర్స్ ప్ర‌ధానంగానే ఈ సినిమా న‌డుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతోన్నారు. మ‌మ్ముట్టి పాత్ర కంప్లీట్‌గా నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. అత‌డి లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని అంటున్నారు. న‌టుడిగా మ‌మ్ముట్టి విశ్వ‌రూపాన్ని మ‌రోసారి ఈ సినిమాలో చూస్తార‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో సాగుతుంద‌ని, విజువ‌ల్‌గా కంప్లీట్‌గా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను భ్ర‌మ‌యుగం అందిస్తుంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌మ్ముట్టి యాక్టింగ్‌తో పాటు విజువ‌ల్స్ కోసం ఈ మూవీ చూడొచ్చ‌ని అంటున్నారు.

మ‌మ్ముట్టి పేరుపై అభ్యంత‌రం...

ఈ సినిమాలో మ‌మ్ముట్టి కుంజ‌మోన్ పొట్టి అనే పాత్ర‌లో క‌నిపించాడు. ఆ పేరుపై కేర‌ళ‌కు చెందిన ఓ వ్య‌క్తి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టును ఆశ్ర‌యించాడు. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా భ్ర‌మ‌యుగం సినిమాలో మ‌మ్ముట్టి పేరు ఉందంటూ అత‌డు త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నాడు. మ‌మ్ముట్టి పేరును మార్పు చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేసిన‌ట్లు తెలిసింది. తెలుగులో భ్ర‌మ‌యుగం మూవీ ఫిబ్ర‌వ‌రి 23న రిలీజ్ కానుంది.

తొలిరోజు మూడు కోట్ల క‌లెక్ష‌న్స్‌...

తొలిరోజు భ్ర‌మ యుగం రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 2.5 కోట్ల వ‌ర‌కు జ‌రిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప‌రంగా మ‌మ్ముట్టి గ‌త సినిమాల రికార్డుల‌ను భ్ర‌మ‌యుగం దాటేసింది. సినిమాపై ఉన్న హైప్ కార‌ణంగా తొలిరోజు భ్ర‌మ‌యుగం ప‌ది కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను, ఐదు కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. కాథ‌ల్ త‌ర్వాత మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మూవీ ఇది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం