తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Longest Movie: 4 గంటలకుపైగా రన్‌టైమ్.. 33 మంది హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్.. ఆ మూవీ ఏదో తెలుసా?

Longest Movie: 4 గంటలకుపైగా రన్‌టైమ్.. 33 మంది హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్.. ఆ మూవీ ఏదో తెలుసా?

Hari Prasad S HT Telugu

08 April 2024, 8:54 IST

    • Longest Movie: ఇండియన్ సినిమాలో లాంగెస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేస్తూ ఏకంగా 4 గంటల 15 నిమిషాలపాటు సాగింది. 33 మంది హీరోలు, 10 మంది హీరోయిన్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
4 గంటలకుపైగా రన్‌టైమ్.. 33 మంది హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్.. ఆ మూవీ ఏదో తెలుసా?
4 గంటలకుపైగా రన్‌టైమ్.. 33 మంది హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్.. ఆ మూవీ ఏదో తెలుసా?

4 గంటలకుపైగా రన్‌టైమ్.. 33 మంది హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్.. ఆ మూవీ ఏదో తెలుసా?

Longest Movie: ఇండియన్ సినిమాలో అత్యంత ఎక్కువ రన్ టైమ్ తో వచ్చిన మూవీ ఏదో తెలుసా? ఇందులో ఏకంగా 33 మంది హీరోలు, 10 మంది హీరోయిన్లు నటించినా.. చివరికి అట్టర్ ఫ్లాపయింది. 4 గంటలకుపైగా రన్ టైమ్ కలిగిన ఆ సినిమా పేరు ఎల్‌వోసీ కార్గిల్. 20 ఏళ్ల కిందటే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. దారుణమైన కలెక్షన్లు రాబట్టగా.. ఎంతో మంది కెరీర్లు కూడా ముగిసిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

సుదీర్ఘమైన సినిమా

2003లో బాలీవుడ్ లో వచ్చిన మూవీ ఎల్‌వోసీ కార్గిల్. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధ నేపథ్యంలో చిత్రీకరించారు. ఈ సినిమా నిడివి 4 గంటల 15 నిమిషాలు. అంతకుముందు మేరా నామ్ జోకర్ పేరుతో ఉన్న 4 గంటల 3 నిమిషాల రికార్డును ఈ ఎల్వోసీ కార్గిల్ బ్రేక్ చేసింది.

రెండు గంటలు కూడా థియేటర్లలో కూర్చోలేకపోతున్న ఈ కాలంలో 4 గంటలకుపైనే సాగే సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా మూవీ మొత్తం స్టార్ హీరోలు, హీరోయిన్లే. బాలీవుడ్ లోని టాప్ హీరోలు 33 మంది, హీరోయిన్లు 10 మంది.. ఇలా మొత్తం 43 మంది లీడ్ యాక్టర్లతో తీసిన సినిమా ఇది.

జేపీ దత్తా డైరెక్ట్ చేసిన ఈ ఎల్‌వోసీ కార్గిల్ మూవీలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్, నాగార్జున, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ, రవీనా టండన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు నటించారు. అలాంటి సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ లాంగెస్ట్ మూవీగా ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

బాక్సాఫీస్ ఫెయిల్యూర్

అయితే అన్ని అంచనాలు, అంత మంది స్టార్లు, ఆ స్థాయి రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాను 2003లోనే రూ.33 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర చివరికి వసూలు చేసింది మాత్రం రూ.31.6 కోట్లు మాత్రమే. కనీసం మూవీ బడ్జెట్ అంత కూడా తిరిగి రాలేదు. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ లభించాయి.

కానీ అంతకు ఆరేళ్ల ముందు వచ్చిన బోర్డర్ సినిమా రేంజ్ లో ఉంటుందని ఊహించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. తొలి షో నుంచే నెగటివ్ టాక్ తో మూవీ కలెక్షన్లు క్రమంగా పడుతూ వచ్చాయి. చివరికి నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లలో కొందరి కెరీర్లు అక్కడితోనే ఆగిపోవడం గమనార్హం.

పెద్ద హీరోలు అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్లకు ఏమీ నష్టం జరగలేదు. కానీ సుమారు పది, పదిహేను మంది నటీనటులు ఈ సినిమా తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. వాళ్లలో కరణ్ నాథ్, అర్మాన్ కోహ్లి, పురు రాజ్ కుమార్, షాజాద్ ఖాన్, ప్రియా గిల్, ఆకాంక్ష మల్హోత్రాలాంటి వాళ్లకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో వాళ్లు ఇండస్ట్రీని వదిలేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం